రాజకీయ పరిపక్వతకు పుట్టపర్తి వేదిక

Political Maturity Debate at Puttaparthi Sai Centenary

పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. పుట్టపర్తిలో జరుగుతున్నది ఆధ్యాత్మిక కార్యక్రమం. కానీ అదే నేతల రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతోంది.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు ప్రముఖులు తరలివచ్చి వాటిలో పాల్గొన్నారు. వారందరికీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు సాధరంగా స్వాగతం పలికారు. ఢిల్లీ తిరిగి వెళుతున్న ప్రముఖులకు మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడు సాదరంగా వీడ్కోలు పలుకుతున్నారు.

ADVERTISEMENT

వీటితో రాజకీయాలలో ఉన్నవారు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు.. ఏవిదంగా వ్యవహరించాలనేది అర్ధమవుతుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు ఉండాలి. అవి బలంగా ఉండాలి. ఉండేందుకు ఎప్పటికప్పుడు ఇటువంటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. అని చంద్రబాబు నాయుడు, మంత్రులు నిరూపించి చూపుతున్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్, కృష్ణా గోదావరి జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల మద్య వివాదాలు ఇంకా అలాగే ఉన్నాయి. అయినా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పుట్టపర్తి వచ్చారు! వచ్చినప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుక ఇరుగు పొరుగు రాష్ట్రాల మద్య సత్సంబంధాలకు ఇటువంటి చిన్న ప్రయత్నాలు కూడా అవసరమే.

కానీ తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఏవిదంగా వ్యవహరించారు? ముఖ్యంగా కేసీఆర్‌… ప్రధాని మోడీ, సాటి సిఎం చంద్రబాబు నాయుడు పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరించారనేది అందరికీ తెలుసు. జగన్‌-కేసీఆర్‌ మంచి మిత్రులే అయినప్పటికీ వారు తమ స్నేహాన్ని రాజకీయాలకే పరిమితం చేశారు తప్ప రాష్ట్రాల మద్య స్నేహ సంబంధాలు పెరిగేందుకు ఉపయోగించలేదు.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుపోతూ వారు పైకి ఎదుగుతూ, తమని నమ్ముకున్నవారిని, తమ తమ రాష్ట్రాలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తుంటారు.

కానీ కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ అందరిపై కత్తులు దూస్తూ, అందరినీ శత్రువులుగా మార్చుకున్నారు. అందువల్ల వారు స్వయంగా నష్టపోయి, తమని నమ్ముకున్నవారికీ తీరని నష్టం కలిగించారు. చివరికి ఇద్దరూ రాజకీయ ఏకాకులుగా మిగిలిపోయారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగిన ప్రతీసారీ ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.

అయితే కేసీఆర్‌, కేటీఆర్‌, జగన్‌ ముగ్గురూ తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని గట్టిగా నమ్ముతున్నారు. ప్రజలను కూడా నమ్మింప జూస్తున్నారు. కనుక ఫలితాలు లేదా పర్యవసానాలు అందుకు తగ్గట్లుగానే ఉంటాయి…. ఎప్పటికీ!

ADVERTISEMENT
Latest Stories