ఇలాగే రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటే…

Andhra Pradesh Development

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, చివరికి ఉత్తరాది రాష్ట్రాలవారు కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీకి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీల గురించి మాట్లాడుకుంటున్నారు.

కానీ ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన ప్రభుత్వం, ప్రజలు, మీడియా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి, వాటి వల్ల కుల సమీకరణాల గురించి, వాటిలో కలిగే మార్పుల గురించి మాట్లాడుకోవలసి వస్తోంది.

ADVERTISEMENT

అంటే ఈ ప్రభుత్వాన్ని అది చేస్తున్న మంచి పనులు చెప్పుకోనీయకుండా వైసీపీ కట్టడి చేస్తోందా?లేక ప్రభుత్వమే ఒక సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈవిధంగా అందరినీ ‘ఎంగేజ్’ చేసి ఉంచుతోందా?అనే సందేహం కలుగక మానదు.

గత 5 ఏళ్ళు ఇలాగే రాజకీయాలు సాగాయి. వాటిని చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోయారు. కానీ ఇప్పుడూ అలాగే సాగుతుంటే ఇక రెండు ప్రభుత్వాలకు తేడా ఏముంది?

కనుక వైసీపీ-కూటమి ప్రభుత్వం మద్య సాగుతున్న ఈ రాజకీయాలు అభివృద్ధిని మింగేయకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడటం చాలా అవసరం. ప్రజలు ఆశిస్తున్నది ఈ రాజకీయాలు కావు. ఈ విషయం వైసీపీ గ్రహించకపోయినా పెద్దగా తేడా, నష్టం ఉండవు. కానీ కూటమి ప్రభుత్వం కూడా గ్రహించకపోతే తప్పకుండా చాలా తేడా వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories