anchor-shyamala-posani-rgv

జగన్ ను నమ్మి వాయిస్ ఆఫ్ వైసీపీ గా మారిన సినీ సెలబ్రేటిస్ ఒక్కొక్కరుగా తమ వేషాలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు క్రియేటివ్ దర్శకుడిగా పేరుగడించిన ఆర్జీవీ వైసీపీ ఫ్యాన్ గాలి తగలగానే సోషల్ మీడియా సైకోగా తన వేషాన్ని మార్చుకున్నారు.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

ఇక ఇదే సినీ రంగంలో మాటల రచయితగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక మంచి గుర్తింపు పొందిన పోసాని జగన్ నామ జపంతో పిచ్చివాడిగా ముద్రవేయించుకున్నాడు. గత ఐదేళ్లుగా ఈయన గారు మీడియా ముందుకొచ్చిన వాగినా వాగుడుకి సినిమా భాషలో చూపిస్తే A సర్టిఫికెట్ కూడా ఇవ్వకూడదు. అంతలా దిగజారిపోయారు పోసాని.

ఇక కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ రంగంలో జరుగుతున్న నీలి భాగోతాలను నగ్నంగా బయటపెడతా అంటూ మీడియా ముందుకొచ్చిన శ్రీరెడ్డి నీలి పార్టీలో పార్టీ భాగమై కలికాలంలో ఉద్బవించిన రాక్షసిలా రెచ్చిపోయింది. ఆడవారికి జరుగుతున్న అన్యాయం పై తన పోరాటం అంటూ మొదలు పెట్టిన ఈమె గారు చివరికి తానూ ఒక మహిళను అనే సంగతి కూడా మరిచిపోయేలా ప్రవర్తిస్తూ సాటి మహిళల జీవితాలను బజారుకు లాగారు.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

అయితే ఈ ముగ్గురు కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తులుగా సమాజానికి పరిచయమై ఒక రాజకీయ నాయుడు ఆడిన వికృత రాజకీయ చదరంగంలో పావులుగా మారి చివరికి చేసిన తప్పుకి ప్రత్యర్థితో కాళ్లబేరానికి వచ్చి దేవుడా..రాముడా..మమ్ము రక్షించండి అంటూ దండాలు పెడుతున్నారు.

అలాగే ఇక మాకు బుద్ది వచ్చింది, రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నాం అంటూ పోసాని పారిపోతే, అప్పుడు టీడీపీ, జనసేన నేతలను కించపరుస్తూ సినిమాలు తీసి మీడియాలో తొడలుకొట్టిన ఆర్జీవీ ఇప్పుడు నాకు రాజకీయాలకు సంబంధం లేదుగా అంటూ సైడ్ అవ్వడానికి సిద్డమయ్యారు.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

జగన్ ను నమ్మి ఇంతమంది నట్టేట మునిగినా, ఇంకా వాయిస్ ఆఫ్ వైసీపీ గా మారడానికి సినీ రంగం నుండి కొంతమంది ఆశావాహులు వస్తూనే ఉన్నారు. ఇక వైసీపీలో సినీ సెలబ్రేటిస్ శకం ఇక్కడితో ముగిసింది అనుకునేలోపే అదే సినీ రంగం నుంచి యాంకర్ శ్యామల వైసీపీ మాయలో, జగన్ ఉచ్చులో చిక్కుకున్నారు.

యాంకర్ కమ్ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల వైసీపీ అనే బంగారు పంజరంలో కోరుండీ కుర్చున్నారు. అయితే ఈ యాంకర్ శ్యామల మీద వైసీపీ కుల దేవతగా పేరొందిన శ్రీరెడ్డి సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మునిగిపోయే పడవ ఎక్కి ఎదురు ఈదాలనుకోవడం ఆమె వెఱ్ఱితనమే అవుతుంది. సొంత చెల్లి, తల్లే జగన్ అరాచకాలను తట్టుకోలేక లబోదిభో మంటుంటే ఈమె గారు జగనన్న వారసురాలిగా చెప్పుకొంటున్నారు.




ఇప్పటికే పోసాని, శ్రీ రెడ్డి, ఆర్జీవీ వంటి వారు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుంటే, ఇక శ్యామల అయితే కాలిపోయిన ఆకులు పట్టుకుని చిగురు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈమెకు కూడా తత్త్వం బోధపడే సమయం రావాల్సిందే. అప్పటివరకు నీలి మీడియాలో వైసీపీ మూడు రంగుల జెండా మోస్తూ నువ్వే మా నమ్మకం జగనన్న అంటూ జగన్ నామస్మరణ చేసుకోవాల్సిందే.