అప్పుడు బరితెగించారు..ఇప్పుడు భయపడుతున్నారు..రేపు..?

Posani Krishna Murali Says Goodbye

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే సూపర్ సిక్స్ అమలు చెయ్యాలని కానీ, అమాంతంగా అమరావతిని సింగపూర్ చేసేయాలని కానీ సగటు సామాన్యుడు ఆశించలేదు. గత ఐదేళ్లుగా నోటికి అడ్డు అదుపులేకుండా, ఉచ్ఛం నీచం తెలియకుండా ఎవరినో మెప్పించడానికి సమాజాన్ని కలుషితం చేసిన కొంతమంది వైసీపీ నేతలను ఖచ్చితంగా కట్టడి చేసి తీరాల్సిందే అంటూ ప్రతి సామాన్యుడు కోరుకున్నాడు.

అయితే ఇది మంచి ప్రభుత్వం అంటూ చేతులు కట్టుకున్న పోలీస్ వ్యవస్థను ఒకేఒక్క ఆరోపణతో నిద్ర లేపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక అక్కడితో చలనం వచ్చిన వ్యవస్థలు ఇది మంచి ప్రభుత్వమే కానీ చేతకాని ప్రభుత్వం కాదని నిరూపించుకోవడం మొదలు పెట్టాయి.

ADVERTISEMENT

దానితో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రోద్బలంతో, జగన్ ప్రోత్సాహంతో సోషల్ మీడియాలో బరితెగించిన వైసీపీ మద్దతుదారుల భరతం పడుతున్నారు ఏపీ పోలీసులు.ఇప్పటికే బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్ర వంటి ఉన్మాదులను పట్టి కటకటాల వెనుకకు నెట్టారు.ఇక రెడ్డి గారి అమ్మాయి, కృష్ణ చైతన్య వంటి వందలాదిమంది వైసీపీ పే టిఎమ్ బ్యాచ్ పై కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.

ఇక ఇటువంటి ఉన్మాద చర్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా పేర్కొనబడిన శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి, రామ్ గోపాల్ వర్మ వంటి వైసీపీ సైకోల మీద కూడా ఏపీ అంతటా కూటమి మద్దతుదారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీనితో అప్పుడు బాబు, పవన్, లోకేష్ ల మీద బరితెగించి నోరేసుకుపడ్డ వీరంతా ఇప్పుడు భయంతో చేతులు జోడించి దండాలు పెడుతూ బతిమాలుతున్నారు.

వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని తలెగరేసిన శ్రీరెడ్డి చేతులు జోడిస్తూ, తల దించుకుని అన్నా నన్ను క్షమించండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంది, లోకేష్ ను ఉద్దేశించి బహిరంగ రంగ లేఖలు రాస్తుంది. ఇక పోసాని విషయానికి వస్తే బాబుని తిట్టడానికే, ఆయన సామజిక వర్గం మీద విషం చిమ్మడానికే తన జీవితం అంకితం అన్నట్టుగా రెచ్చిపోయారు.

చిన్న పిల్లలు, మహిళలు అనే కనీస సంస్కారం కూడా లేకుండా పవన్ కుటుంబం మీద జుగుప్త్సాకరంగా విమర్శలు చేసిన ఈ తలతిక్కల పోసాని ఇప్పుడు దండాలు పెడుతూ ఇక నేను రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నాను, నా ఆఖరి శ్వాస వరకు కుటుంబ కోసమే జీవిస్తాను అంటూ కూటమి ప్రభుత్వంతో కాళ్లబేరానికి వచ్చారు.

ఇక ఆర్జీవీ అయితే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేత, సినిమాలలో ఒక స్టార్ డమ్ అనుభవిస్తున్న నటుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అనే కనీస సృహ లేకుండా చేతికి వచ్చిన పోస్టులు పెట్టుకుంటూ, నోటికి వచ్చిన వాగుడు వాగుతూ ఎంతోమంది మనోభావాలు దెబ్బ తీస్తూ ఆయా పార్టీల అభిమానుల మానసిక క్షోభకు కారణమయ్యాడు.

అప్పుడు ముందు ఆలోచన లేకుండా రెచ్చిపోయి ఇప్పుడు కనీసం విచారణకు హాజరు కావడానికి కూడా భయపడుతూ దాక్కుంటున్నారు. వీరంతా కూడా ప్రస్తుతానికి భయం నటిస్తున్నారా.? లేక నిజంగానే భయపడుతున్నారా.? అనేది తెలియని అంటే రాష్ట్రం మరో సారి వైసీపీ సంక్షోభంలోకి వెళ్లాల్సిందే. అయితే చేసిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు సారీ అనే రెండు అక్షరాలు చెపితే వీరిని క్షమించాలా.?

ఇటువంటి వారిని క్షమించి వదిలి పెడితే రేపు వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఉన్మాదులు సోషల్ మీడియా రూపంలో సమాజాన్ని విష పూరితం చేసేస్తారు. ఇప్పుడు చేతులు జోడిస్తున్న ఈ సంఘ విద్రోహులు ఒక వేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీ పరువుని, ఏపీ నేతల కుటుంబాలను బజారులాగేవారు కాదా.? వీరిని క్షమించి వదిలి పెడితే అది కూటమి ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మారుతుంది.

ఇంత జరిగిన వీరంతా కూడా ఇంట వరకు జగన్ మీద కానీ వైసీపీ పార్టీ విధానాల మీద కానీ ఒక్క విమర్శ కూడా చేయలేకపోతున్నారు. అంటే వీరికి కూటమి ప్రభుత్వం మీద భయంతో పాటు జగన్ మీద మితిమీరిన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు అనేది సుస్పస్టమవుతుంది. చట్టం తన పని తానూ చేసుకు పొతే కానీ సామాన్యుడి చట్టాల మీద నమ్మకం, ఇటువంటి రాజకీయ ఉగ్రవాదులకు చట్టాల మీద భయం కలుగుతాయి.

ADVERTISEMENT
Latest Stories