పవన్ కళ్యాణ్ బస చేసిన కల్యాణమండపంకు కరెంటు కట్

Power cut to Pawan Kalyan Accomdationజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో బస చేసిన ఓ కల్యాణమండపం వద్ద వివాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి కొంత మంది విద్యుత్తు సిబ్బంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ బయటకు రావాలని నినదించారు.

ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ బయటకు రారని, బుధవారం ఉదయం వస్తే కలవవచ్చని వారితో కల్యాణమండపం వద్ద కాపలా ఉన్న ప్రైవేటు సిబ్బంది చెప్పారు. ఆయన ఎలా బయటికి రారో చూస్తామంటూ విద్యుత్తు సరఫరాను సిబ్బంది నిలిపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి కొట్లాటకు దారితీసింది.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ బౌన్సర్‌ సునీల్‌ కాలికి గాయమైంది. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కల్యాణమండపానికి విద్యుత్తు సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో తరచుగా బౌన్సర్లతో వివాదం అవ్వడం విదితమే.

ADVERTISEMENT
Latest Stories