‘టిడిపి – టీఆర్ఎస్’ ఎమ్మెల్యేకు హార్ట్ఎటాక్!

prakash goud died with heart attackరంగారెడ్డి జిల్లా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నేడు ఉదయం గుండె పోటుకు గురయ్యారు. టీడీపీ టికెట్ పై విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ ఇటీవలే సైకిల్ పార్టీకి హ్యాండిచ్చి కారు ఎక్కిన విషయం తెలిసిందే. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని దుర్గానగర్ లోని తన సొంతింటిలో గుండెపోటుకు గురయ్యారు.

దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రకాశ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన కుటుంబ సభ్యులు క్షణాల్లో ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories