టి.బీజేపీ లో ముసలం మొదలయ్యిందా.?

Problems Started In Telangana BJP

టి. బీజేపీ నాయకత్వ మార్పు పార్టీని పతనం దిశగా నడిపిస్తుందా అన్నట్టుగా తెలంగాణ బీజేపీ లో గ్రూపు రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాదిరే బీజేపీ లో కూడా గ్రూప్ రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయా.? అందుకు పార్టీ అధ్యక్ష మార్పు భీజం వేసిందా అన్న చర్చ నడుస్తుంది.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకంతో తెలంగాణలోని సీనియర్ బీజేపీ నాయకులు, ఆ పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ వలస నేతలు ఇప్పుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మౌన ముద్రలోకి వెళ్లిపోయారు.

ADVERTISEMENT

అందులో బీజేపీ సీనియర్ నాయకుడు, ధర్మపురి ఎంపీ అరవింద్, బీజేపీ వలస నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, రాజా సింగ్ ఇలా తెలంగాణ బీజేపీ లో అనేకమంది నాయకులు బీజేపీ అధిష్టాన నిర్ణయం పై అలకపూని కొందరు పార్టీ కి రాజీనామా చేసారు, మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు.

అలాగే ఇన్నాళ్ళుగా తెరచాటుగా సాగుతున్న బీజేపీ అంతర్గత విభేదాలు నేడు తెరమీదకు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకు నేడు ఈటెల టార్గెట్ గా బండి చేసిన పరోక్ష విమర్శలే సాక్ష్యాలుగా మారాయా.? అంటూ టి. బీజేపీ లో ముసలం మొదలయ్యింది.

ఎక్కడా లేని సమస్య హుజురాబాద్ లోనే వస్తుంది, ఎంపీ ఎన్నికల సమయంలో హుజురాబాద్ సెగ్మెంట్ లోనే తనకు తక్కువ ఓట్లు పడేలా సొంత పార్టీ నేతలే కుట్ర పన్నారు అంటూ బండి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఉన్న అంతర్గత పోరును బయటపెట్టినట్లయ్యింది.

మరి సమస్య పరిష్కారం కోసం టి. బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంటువంటి ప్రణాళికలు వేస్తారో.? పార్టీ నేతలను ఎంత కట్టడి చేయగలరో వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories