‘బాహుబలి’ ధాన్యం… ఇక అందరూ బాహుబలులే..!

protein-rich-rice-developed-igkv Indira Gandhi Agricultural Universityఇండియాలో పౌష్టిక ఆహార లోపం ఉన్న విషయం తెలిసిందే. ఒక రకంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇది. పౌష్టిక ఆహార లోపం వలన ఏటా ఎంతో మంది పిల్లలు అకాల మృత్యుబాట పడుతున్నారు. ఈ సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతూ ఉంటోంది. దీనిని నియత్రించడానికి అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో అత్యధిక పౌష్టిక విలువలు గల బియ్యాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ధాన్యపు రకాలన్నింటిలోకల్లా పౌష్టికం కావడంతో, ఇది ‘బాహుబలి’ ధాన్యం అయ్యింది. ఈ కధాకమామీషు ఏంటో తెలుసుకోవాలంటే…

ప్రొటీన్లు, జింక్ అధికంగా ఉండే ధాన్యం కోసం ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ (ఐజీకేవీ) పరిశోధకులు గత ఏడేళ్లుగా చేస్తున్న కృషి ఇన్నాళ్లకు ఫలించింది. పోషకాహార లోపంతో బాధపడే గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ బియ్యం వరప్రదాయని అయ్యే అవకాశం ఉందని అధ్యయనానికి సారథ్యం వహించిన ఐజీకేవీ ప్రొఫెసర్ డాక్టర్ గిరీశ్ చందల్ తెలిపారు. మాంసం తినని, పప్పులు కొనలేని ప్రజలకు ఈ బియ్యం ద్వారా మేలైన ప్రొటీన్లు అందుతాయని పేర్కొన్నారు.

ADVERTISEMENT

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బియ్యం రకాల్లో పిండి పదార్థం అధికంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రొటీన్ మోతాదులు అయితే బహు స్వల్పం. అయితే తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం బియ్యంలో 10 శాతానికి పైగా ప్రొటీన్ ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకాలతో పోలిస్తే ఇది మూడు శాతం అధికం. అలాగే జింక్ కూడా 30 పీపీఎం వరకు ఉంటుంది. అభివృద్ధి చేసిన ధాన్యం రకాన్ని ఆరు నెలల్లోగా రాష్ట్ర గుర్తింపు కమిటీకి పంపిస్తామని, వచ్చే ఏడాది నుంచి సాగుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉందని గిరీశ్ చందల్ వివరించారు.

ADVERTISEMENT
Latest Stories