అందుకే పరదాలు కట్టేది…అర్ధం చేసుకోవాలి మరి!

YS Jagan

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకమైన జగన్ అధికారం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మాత్రం ప్రజలకు మొఖం చాటేశారనే చెప్పాలి. ఏవో కొన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకో, బటన్ నొక్కే కార్యక్రమాలకో ముఖ్యమంత్రి హోదాలో ప్రజల మధ్యకు రావడానికి బయటకు వచ్చే జగన్ పరదాలను ఎందుకు వాడుతున్నారు అనే ప్రతిపక్షాల ప్రశ్నకు నేడు పులివెందులలో సమాధానం దొరికింది.

తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పర్యటనకు వెళ్ళిన జగన్ కు కూడా ప్రభుత్వం పై “వై నాట్ పులివెందుల” అంటూ టీడీపీ పార్టీ చేస్తున్న విమర్శలలో నిజానిజాలు ఏమిటో, తానూ ఇచ్చిన “వై నాట్ 175 “ఎంత ఉహాజనితమైనదో తెలిసొచ్చింది.గడిచిన నాలుగున్న రేళ్ళుగా రాష్ట్రంలో జగన్ పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ పరదాలు కట్టడం, పచ్చని చెట్లను కొట్టడం ఆనవాయితీగా మారిపోయింది.

ADVERTISEMENT

తాజాగా రెండు రోజుల పులివెందుల పర్యటనకు వెళ్ళిన సీఎం జగన్ కు స్థానిక ప్రజల నుండి నిరసన సెగ తగిలింది.సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ పరదాల అవసరం ఉండదని భావించిన జగన్ కు పరదాల ఆవశ్యకత తెలియచెప్పారు స్థానిక ప్రజలు.”సీఎం రావాలి మా మోర వినాలి” అంటూ స్థానిక నిరసన కారులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన బాధితులు ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని కనీసం మీ తండ్రిగారి హయాంలో ఇచ్చిన మాటను మీరైనా నిలబెట్టుకోవాలంటూ జగన్ కు స్థానిక బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమ భూములు తీసుకుని దశాబ్దాలు గడుస్తున్నా తమకు పరిహారం కానీ,తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కానీ ఇవ్వలేదని పెద్దరంగా పురం గ్రామస్తులు జగన్ పర్యటనలో తమ నిరసన తెలియచేసారు. తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ స్థానిక ప్రజలు జగన్ ను అడ్డుకున్నారు. ‘సార్ సీఎం సార్…మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలివ్వడంతో ఊహించని పరిణామంతో కంగుతిన్న సీఎం జగన్ స్థానిక ప్రజల నిరసనను పట్టించు కోకుండా మెల్లగా జారుకున్నారు.

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వైసీపీ నేతలు, నాయకులు, మంత్రులు ఎందుకు ఆసక్తి చూపడంలేదో జగన్ కు ఇప్పుడు బాగా అర్ధమయ్యి ఉంటది అంటున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు సొంత పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యే లు కూడా.మా అన్న పులివెందుల పులి అని చెప్పుకునే వైసీపీ నాయకులు అక్కడి బాధితుల సమస్యలకు ఓ పరిష్కారం చూపకుండా ఓ భరోసా ఇవ్వకుండా పిల్లిలా అక్కడి నుండి జగన్ ఎలా జరుకున్నారో ఓసారి మీరుకూడా చూసి తరించండి అంటూ ఈ వీడియోను టీడీపీ పార్టీ తన సామజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది.

ఇందుకే కాబోలు జగన్ ప్రజల మధ్యకు వస్తే పరదాలు కట్టుకుంటారు…అంటూ టీడీపీ అభిమానులు ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. పరదాల ముఖ్యమంత్రికి తన కళ్లకున్న పరదా తొలిగిస్తే రాష్ట్రంలో తన పరిస్థితి, తన ప్రభుత్వ పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఏంటో ఒక్కసారిగా జ్ఞానోదయం అవుతుంది అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.

ఒక్కసారి పరదాలను,అధికారులను, వ్యవస్థలను పక్కనపెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తే “వైసీపీ ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేకత కళ్లారా చూడొచ్చు చెవులారా వినొచ్చు” అనేది ఈనాడు పెద్దరంగాపురం గ్రామస్తులు నిరూపించారు. ఇప్పటికైనా జగన్ కు తత్త్వం బోధపడిందో లేక భ్రమలనే కాలం గడుపుతారో చూడాలి మరి! అందుకే పరదాలు కట్టేది… ప్రతిపక్షాలు, ప్రజలు కూడా మానవతా దృక్పధంతో జగన్ సమస్యలను అర్ధం చేసుకోవాలిగా మరి!

ADVERTISEMENT
Latest Stories