Raja Singh Praises Revanth Reddy, Sparks BJP Tension

జాతీయ పార్టీగా కేంద్రంలో హ్యాట్రిక్ విజయం అందుకున్న బీజేపీ ఇటు దక్షిణాదిన మాత్రం తన బలం పుంజుకోలేకపోతుంది. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ ఒక్కో మెట్టు ఎక్కుతు, తన ప్రత్యర్థి పార్టీలను ఒక్కో మెట్టు దింపుతూ తన బలం పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తుంది.

Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…

అయితే ఇక్కడ పార్టీ బలోపేతానికి అవసరమైన సరైన నాయకుడు బీజేపీ పార్టీకి అంతు చిక్కడం లేదు. బండి సంజయ్ అధ్యక్షతన తెలంగాణలో కాస్త పుంజుకున్న బీజేపీ ఆ తరువాత నాయకత్వ సమస్యతో అల్లాడుతోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ నాయకుడు రాజా సింగ్ ఆ పార్టీలో మొలిచిన కలుపు మొక్కా.? లేక బీజేపీ కి దొరికిన తులసి మొక్కా అనేది బీజేపీ కూడా నిర్దారించుకోలేకపోతుంది. ఒక్కోసారి బీజేపీ పార్టీ కి అనుకూలంగా మాట్లాడుతున్న రాజా సింగ్ మరోసారి సొంత పార్టీ నాయకుల మీదే విమర్శలు చేస్తూ, వారికి పరోక్ష కౌంటర్లు ఇస్తూ బీజేపీని ఇరుకున పెడుతున్నారు.

Also Read – వైసీపీ లో ఆషాడం ఆఫర్..?

బీజేపీ అధిష్టానం తో మొదలుపెడితే, తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులైన బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి వరకు ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో బీజేపీ సైతం ఉహించలేకపోతుంది.

అలాగే బీజేపీ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పై ఎప్పుడు ఎటువంటి పొగడ్త పొగుడుతారో కూడా తెలంగాణ బీజేపీ నేతలకు అంతు చిక్కడం లేదు. కొన్ని వివాదస్పద వ్యాఖ్యలతో నాడు అరెస్టయ్యి జైలుకెళ్లిన రాజా సింగ్ ఆ పై బయటకొచ్చి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను ఉలిక్కిపడేలా చేసాయి.

Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్‌ జీర్ణించుకోగలవా?

తానూ అరెస్టయిన సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతల కంటే బీజేపీ నాయకులే ఎక్కువగా ఆనందపడ్డారు అంటు తెలంగాణ బీజేపీ పై వ్యతిరేక స్వరం వినిపించారు. అలాగే కిషన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ మీ సమయం కాస్త మాలాంటి వారికీ కూడా ఇవ్వండి సార్ అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోడ్రన్ గోశాలలు నిర్మించాలి అన్న రేవంత్ నిర్ణయం పై రేవంత్ కు ధన్యవాదాలు తెలుపుతూ, దేశంలో ఉన్న సీఎం లలో నిజమైన గోసంరక్షకులలో మొదటి వారు యోగి ఆదిత్యనాధ్ అయితే రెండవారు రేవంత్ రెడ్డి అంటు ప్రశంసలు కురిపించారు.

అలాగే తెలంగాణలో గోవధను నిషేదించాలని, రాష్ట్రంలో గోవుల రక్షణకు ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనీ, అందులో తనని కూడా ఒక సభ్యుడిగా ఎంపిక చేయాంటూ రేవంత్ కు తనదైన సూచనలు, విజ్ఞప్తులు తెలియచేసారు.




అయితే ప్రతిపక్షం అంటే ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రతి అంశంలోనూ ప్రభుత్వ పెద్దలను తప్పుపట్టాలి అన్న రాజకీయ హద్దులు చెరిపేస్తూ రాజాసింగ్ చేస్తున్న ఈ తరహా రాజకీయం బీజేపీ ని ఒక్కొకసారి రాజకీయంగా ఇరుకున పెడుతుంది.దీనితో రాజా సింగ్ బీజేపీ కి బలమా.? బలహీనమా.? అనేది బీజేపీ కూడా తేల్చుకోలేకపోతుంది.