రామ్ చరణ్… ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..!

Ram Charan talks about katamarayuduమెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా అభిప్రాయ బేధాలు ఉన్నా… మీడియా వర్గాలలో అవి ఎప్పుడూ హైలైట్ కాలేదు. కానీ, ఎప్పుడైతే ఈ మ్యాటర్ లోకి మెగా కాంపౌండ్ యువతరం రామ్ చరణ్, అల్లు అర్జున్, శిరీష్ వంటి వారు ఎంటర్ అయ్యారో… ఇది కాస్త రచ్చ రచ్చ అయ్యింది. దీంతో మీడియా వర్గాల వేదికగా అనేక సందర్భాలలో పవన్ ఒక్కడే ఒక వైపు, మిగతా వారంతా మరో వైపు అనే భావనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆయా పరిస్థితులలో మార్పు స్పష్టంగా కనపడుతోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ డైలాగ్ తో బన్నీ హైలైట్ కాగా, పవన్ అభిమానులకు కూడా బన్నీనే టార్గెట్ కావాల్సి వచ్చింది. ఈ ఉదంతం బన్నీ కెరీర్ పై ఎలాంటి ప్రభావితం చూపిందో ఇటీవల విదులైన ‘దువ్వాడ జగన్నాధమ్’ టీజర్ డిస్ లైక్స్ చెప్పకనే చెప్పాయి. మరోవైపు చిరు కుటుంబం నుండి పవన్ పై సానుకూల ప్రకటనలు వస్తుండడం విశేషం. మెగా బ్రదర్ నాగబాబు అయితే తను ‘జనసేన’ నుండి పోటీ చేసినా చేస్తాను, అనే స్థాయికి వెళ్ళగా, చిరు కూడా ఒకటి, రెండు సందర్భాలలో పవన్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు.

ఇక, ‘ధృవ’ సినిమా విడుదలకు ముందు నుండి రామ్ చరణ్ నుండి కూడా సానుకూల ప్రకటనలు వచ్చాయి గానీ, అవి కేవలం ఒకటి, రెండు వ్యాఖ్యల వరకే పరిమితం అయ్యాయి. అయితే చాలాకాలం తర్వాత విశాఖలో జరిగిన ఓ ఈవెంట్ లో చెర్రీ ‘కాటమరాయుడు’ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. ‘ధృవ, ఖైదీ నంబర్ 150’ సినిమాల మాదిరే ఈ ఉగాదికి ‘కాటమరాయుడు’ని మెగా ఫ్యామిలీకి అందించండి అంటూ పలికిన చెర్రీ ఎంతో ఉత్సాహంతో కనపడ్డారు. అలాగే ‘ట్రైలర్’ చూసారా… అదిరిపోయిందిగా… అంటూ ఒక సాధారణ అభిమాని మాదిరి స్పందించడం గమనించదగ్గ విషయమే!

ADVERTISEMENT
Latest Stories