వచ్చే ఎన్నికలలో వైసీపీకి మేలు కలిగించేవిదంగా, టిడిపి, జనసేనలను దెబ్బ తీసేలా దర్శకుడు రాంగోపాల్ వర్మతో వైసీపీ నేతలు ఓ సినిమా తీయబోతున్నట్లు ముందే చెప్పుకొన్నాము. అవి ఊహాగానాలు కావని నిజమే అని రాంగోపాల్ వర్మ స్వయంగా స్పష్టం చేశారు. అంతేకాదు… తన సినిమా టైటిల్ ‘వ్యూహం’ అని అప్పుడే ప్రకటించేశారు కూడా. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఇది (జగన్మోహన్ రెడ్డి) బయోపిక్ కాదని, బయోపిక్ కంటే లోతైన రియల్ పిక్ అని ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చు కానీ ఈ రియల్ పిక్‌లో మాత్రం నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అహంకారానికి, ఆశయానికి మద్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన కధే వ్యూహం అని ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపుపై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే ఈ వ్యూహం చిత్ర కధ అని రాంగోపాల్ వర్మ చెప్పేశారు.
రాంగోపాల్ వర్మ సినిమా వ్యూహం వెనుక వైసీపీ వ్యూహం ఏమిటో ముందే లీక్ అయిపోయింది. కనుక దీనిని వైసీపీ కోణంలో నుంచి తీసి, దానిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాచపుండు వంటివారని, జగన్ వ్యూహాలను తట్టుకోలేక వారు బొబ్బలు పెడుతున్నారని రాంగోపాల్ వర్మ తన సినిమాలో చూపించబోతున్నట్లు స్పష్టం అవుతోంది. అహంకారం అంటే పవన్ కళ్యాణ్‌కి, ఆశయం అంటే జగన్మోహన్ రెడ్డికి మద్య పోరాటం అని భావించవచ్చు.. ఈ సినిమా తీయడమే ఓ పెద్ద రాజకీయ కుట్ర. దానిలో నిజాలు చెపుతారని ఎలా అనుకోగలము?కుట్రలు, కుతంత్రాలతో కూడిన ఈ సినిమాలో అన్నీ నిజాలే ఉంటాయని చెప్పడం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం వంటిదే!
Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?
వ్యూహం తర్వాత శపధం… తట్టుకోలేరట!
ఈ సినిమాకు నిర్మాత దాసరి కిరణ్ అని రాంగోపాల్ వర్మ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా నేను ఈ సినిమా తీయట్లేదని చెపితే ఎవరూ నమ్మరు కనక ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు, అంటూ మరో ట్వీట్ చేశారు
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
వ్యూహం చిత్రం రెండు పార్టులుగా తీస్తాను. రెంటిలోనూ రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం ఇచ్చిన షాక్ నుంచి తేరుకొనేలోపే వాళ్ళకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్-2 ‘శపధం’ రూపంలో తగులుతుంది,” అని ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేందుకు వైసీపీ ఓ పక్క ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ సేవలు వినియోగించుకొంటూనే, మరోపక్క రాంగోపాల్ వర్మను కూడా ఈవిదంగా ఉపయోగించుకోవాలనుకోవడం చూస్తుంటే దానిలో ఎంత అభద్రతాభావంతో ఉందో అర్దం అవుతోంది.
Also Read – అందరికీ సారీ.. అదిదా సర్‌ప్రీజు!
అంటే మూడున్నరేళ్ళుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ ఇస్తున్న సంక్షేమ పధకాలు కానీ, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాలు, ప్రజల మద్య చిచ్చురగిలిస్తున్నా గానీ, కమ్మకాపు, బీసీలంటూ కులచిచ్చు రగిలిస్తున్నాగానీ వచ్చే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ గెలవడం కష్టమని భావిస్తుండబట్టే ఒకేసారి ఇన్ని వ్యూహాలు అమలుచేస్తున్నట్లు అర్దమవుతోంది.
ఎన్నికలలో గెలిచేందుకు తప్పకుండా వ్యూహం అవసరమే కానీ ఈ వ్యూహం మాత్రం కానేకాదు. ఎన్నికలలో గెలవాలంటే ముందుగా ప్రజాధారణ చాలా అవసరం. అది లేనప్పుడు ఎన్ని వ్యూహాలు వేసినా తీసినా ఏ ప్రయోజనం ఉండదు… రాంగోపాల్ వర్మలాంటి పెయిడ్ దర్శకుడిని పోషించడం తప్ప! నిత్యం పెయిడ్ ఆర్టిస్ట్, ప్యాకేజ్ స్టార్, ఎల్లో మీడియా అంటూ ప్రతిపక్ష నేతలను, మీడియాను ఎద్దేవా చేసే వైసీపీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?