జనసేన పార్టీ కాదు… కంపెనీ అట!

ram-gopal-varma-rgv-film-on-pawan-kalyan-3-marriages

వివాదాస్పద దర్శకుడనే సబ్ టైటిల్‌ కలిగిన రాంగోపాల్ వర్మ, సినిమాల కంటే ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారని, అదీ… వైసీపి కళ్ళద్దాలు పెట్టుకుని టిడిపి, జనసేనలను లక్ష్యంగా ట్వీట్స్, సినిమాలు చేస్తుంటారని అందరికీ తెలుసు.

ఆయన వైసీపి కోసం అల్లిన ‘వ్యూహం’ తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కానీ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడంపై ఏ కోర్టు స్టే విధించలేదు కనుక ఆయన అక్కడ తన ప్లాన్-బిని అమలుచేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఆయన తాజా ట్వీట్‌: “ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు పొలిటికల్ కంపెనీలుగా మారిపోతున్నాయి. తమ విలువ ఆధారంగా ఓటు బ్యాంక్ తయారుచేసుకున్నాక, మంచి ప్యాకేజ్ ఇచ్చిన గుత్తేదారు పార్టీకి దానిని అమ్మేసుకుంటున్నాయి.”

ఇది జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌లను ఉద్దేశ్యించి చేసిన ట్వీట్‌ అని అర్దమవుతూనే ఉంది. చంద్రబాబు నాయుడి దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అని ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పదేపదే విమర్శిస్తుంటారు. రాష్ట్రంలో కాపు ఓటు బ్యాంకుని చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని కూడా జగన్‌ ఆరోపిస్తుంటారు.

సరిగ్గా ఆయన చెప్పిన లైన్ ప్రకారమే రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్‌ చేశారని అర్దమవుతోంది. అయితే ఇలా తనకు సంబంధం లేని రాజకీయాలలో వేలుపెట్టి ఎదురు దెబ్బలు తినే బదులు, ప్రశాంత్ వర్మలాగ చక్కటి సినిమాలు చేసుకుని మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా? కానీ రాంగోపాల్ వర్మ అటువంటి ప్రయత్నం ఎందుకు చేయడం లేదో?

ADVERTISEMENT
Latest Stories