గురివింద గింజకు తన నలుపు తనకు తెలియదన్నట్టు ఉంది రాంమాధవ్ వరస!

ram-madhav targets chandrababu naiduram-madhav targets chandrababu naiduశనివారం గుంటూరులోని గుంటూరు సిద్దార్థ గార్డెన్స్‌లో ఎన్డీయే నాలుగేళ్ళ పాలన విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు సమస్య వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ప్రభుత్వ ఖర్చులతో ధర్మదీక్షలు చేయడమేంటి? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ప్రశ్నించారు.

ఆయన చెప్పింది మంచిదే. ప్రజల ధనం పట్ల ప్రభుత్వాలకు బాధ్యత ఉండాలి. ప్రభుత్వం ధనం దుర్వినియోగం అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న రాంమాధవ్ తెలివిగా తమకు మద్దత్తు ఇస్తున్న పార్టీలతో పార్లమెంట్ ను స్తంభింప చేసి పార్లమెంట్ ను దాదాపుగా నెల రోజులు నడవకుండా చేసిన సంగతి గుర్తు లేదేమో.

ADVERTISEMENT

ఇలా ఎన్ని వందల కోట్లు పార్లమెంట్ సాక్షిగా దుర్వినియోగం చేశారు బీజేపీ వారు. ఇక్కడి డబ్బులే డబ్బులా? బాధ్యత అనేది వేరే వాళ్ళకి చెప్పడానికే గానీ తమకు కాదని కమలనాధులు భావిస్తున్నారా? గురివింద గింజకు తన నలుపు తనకు తెలియదన్నట్టు ఉంది రాంమాధవ్ వ్యవహారం

ADVERTISEMENT
Latest Stories