అర్దరాత్రి వేళలో శాస్త్రి గారి ట్వీట్లు!

ramajogayya-sastry tweets on bharat ane nenuఉగాదికి విడుదల అవుతుందనుకున్న ఫస్ట్ సింగిల్ స్థానంలో ‘భరత్ అనే నేను’ టీం పోస్టర్ ను విడుదల చేసిన వైనం తెలిసిందే. పాట కంటే కూడా ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చిన ఆ పోస్టర్ హంగామా ముగియక ముందే, ఈ సినిమా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారు అభిమానులకు మరో సందేశాన్ని ఇచ్చారు. ‘ఉగాదికి – శ్రీరామనవమికి నడుమ మనకో పండగ వచ్చే సూచనలున్నాయి’ అంటూ శాస్త్రి గారు చేసిన ట్వీట్ తో అభిమానుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది.

ADVERTISEMENT

అయితే చిత్ర యూనిట్ అధికారికంగా డిక్లేర్ చేయడాని కంటే ముందే తాను చేస్తోన్న ట్వీట్లకు డైరెక్టర్ కొరటాల శివ ఏమైనా ఆగ్రహం చెందుతారేమోనని, ‘మన్నించాలి… ఇప్పుడు నేను ఫ్యాన్స్ వైపు…’ అంటూ చమత్కరిస్తూ మరో ట్వీట్ చేసారు. ఇక అంతకుముందు అయితే ఫ్యాన్స్ లో అంచనాలను భారీ స్థాయిలో పెంచే విధంగా మరో ట్వీట్ వచ్చింది. “నన్ను నమ్మండి… ఏప్రిల్ మూడవ వారంలో ఓ ఎపిక్ ను చూసిన అనుభూతి మీకు కలుగుతుంది, ప్రతిది పర్ ఫెక్ట్ గా కుదిరింది, టీం అంతా ఎంతో ప్యాషనేట్ గా పనిచేస్తోంది” అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఇలా ఆదివారం అర్దరాత్రి సమయంలో చేసిన ట్వీట్లు ఫ్యాన్స్ లో సంతోషాన్ని ముంచెత్తాయి. అయితే వీటిని భిన్న స్పందనలు కూడా వచ్చాయి. గతంలో ‘స్పైడర్, అజ్ఞాతవాసి’ వంటి సినిమాల విడుదల సమయంలో కూడా జోగయ్య ఇలాంటి హై పిచ్ ట్వీట్లు చేసి అభిమానుల్లో అంచనాలను భారీ స్థాయిలో పెంచేసాడు. తీరా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న వైనాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే… శాస్త్రి గారు ఈ సారి నన్ను నమ్మండి… అంటూ బల్లగుద్ది చెప్తున్నారు!

ADVERTISEMENT
Latest Stories