
అభిమానం హద్దులు దాటుతుంది, అతి ప్రేమ విషాదంగా మారుతుంది అని ఆర్సీబీ వివాదంతో మారోమారు రుజువయ్యింది. 18 ఏళ్ళ నిరీక్షణ, RCB కి ఐపీఎల్ కప్ వచ్చిందనే సంతోషం కనీసం 18 గంటలు నిలవలేకపోయింది ఆర్సీబీ అభిమానులకు.
RCB అభిమానులు “లాయలీ రాయల్”…అంటూ విరాట కోహ్లీ తమ జట్టు అభిమానుల గురించి సగర్వంగా చేసిన వ్యాఖ్యలు ఇంకా అందరికి చేరకమునుపే ఆ జట్టు అభిమానులలో విషాద ఛాయలు నిండుకున్నాయి.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్ కూడా?
RCB విజయోత్సవ సంబరాలు చివరికి విషాదంతో మూగబోయాయి. తమ అభిమాన క్రికెటర్ ను దగ్గర నుంచి చూడాలి, ఆయన చేసే ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలి అనే ఆశే నేడు 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది.
అభిమానం హద్దులు దాటితే అది చివరికి విషాదాన్ని మిగులుస్తుంది అని చెప్పటానికి మరో ఘటనగా బెంగళూర్ జట్టు విజయోత్సవ సంబరాలు సాక్షిగా నిలిచాయి. నాడు పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన చేదు ఘటన మరువకముందే నేడు ఆర్సీబీ విషాదం కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది.
Also Read – ఒవైసీ రాజకీయాలు వైసీపీ కోసమేనా.?
పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఒక నిండు కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇందులో తప్పఎవరేది.? ఎవరిని దోషిగా చూపించాలి.? శిక్ష ఎవరికీ పడుతుంది.? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అభిమనానికి హద్దు తెలుస్తుంది.
తమ అభిమాన నటుడి మీదో, ఆటగాడి మీదో, నాయకుడి మీదో అభిమానం ఉంటే దాన్ని వ్యక్తపరచాల్సిన పద్దతి ఇది కాదు అని ఎన్ని సార్లు ఇటువంటి ఘటనలు హెచ్చరిస్తున్నా మళ్ళీ అవే చేదు జ్ఞాపకాలు కోరి తెచ్చుకుంటున్నారు అభిమానులు.
Also Read – జగన్ వల్లనే ఆ కార్యకర్త ఆత్మహత్య… దండేస్తే ఆ పాపం పోతుందా?
సంబరాలు జరుపుకోవడానికి వచ్చి శాశ్వతంగా కుటుంబాలకు దూరమయిన ఈ పిచ్చి అభిమానం ఎవరికీ మేలు చేస్తుంది. ఆలోచించండి. జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేరు, నష్టపరిహారాలో, పరామర్శలో, సానుభూతి ప్రకటనలో విషాదం నిండిన కుటుంబాలకు సంతోషాన్ని పంచలేవు.
నిన్న జరిగిన దుర్ఘటనకు బాధిత కుటుంబాలకు తమవంతుగా ఆర్సీబీ నుంచి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. అలాగే బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనే భరోసా అందింది. అయినా కూడా ఆ కుటుంబాల నుంచి కారుతున్న కన్నీటి ధారకు అడ్డుకట్ట వెయ్యగలమా.?
నా బిడ్దకు పోస్ట్ మర్డర్ వద్దు, నా బిడ్ద శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయొద్దు అంటూ ఒక తండ్రి పడుతున్న ఆవేదన ఎన్ని కప్పులు కొడితే తీరుతుంది.? ఎన్ని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తే తిరిగి ఆ కుటుంబంలో చిరునవ్వు కనిపిస్తుంది.?
పబ్లిక్ ను పేస్ చేసే సందర్భాలలోను, పబ్లిక్ ఈవెంట్స్ జరుగుతున్న సమయంలోను సెలబ్రెటీలు సైతం తమ కుటుంబాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. అటువంటిది, సామాన్యులు మాత్రం తమ పిల్లలు కోరుకున్నారనో, ఆశపడ్డారనే ఇటువంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు పిల్లలతో కలిసి వెళ్లడం, వారికి వెళ్ళడానికి అనుమతివ్వడం కేవలం నిర్లక్ష్యమే అవుతుంది.
అభిమానానికి హద్దులు పెట్టుకున్న రోజే ఇటువంటి దురదృష్ట ఘటనల నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అలాగే ఇటు ప్రభుత్వాలు కూడా ఇటువంటి క్రౌడ్ పుల్లింగ్ అకేషన్ విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తల విషయంలో రాజీ లేకుండా పనులు పూర్తి చెయ్యాలి. అలాగే అకేషన్ నిర్వాహకులు కూడా తమ అభిమానులకు నిర్దిష్టమైన సమాచారాన్ని అందించాలి. ఇకనైనా వినోదాలకు, వేడుకలకు విషాదాలు ముగింపు కాకుండానే ఆశిద్దాం.