
కేసీఆర్ ప్రాంతీయవాదంతో టిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని అధికారంలోకి వచ్చాక, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యంతో పార్టీ పేరును బిఆర్ఎస్ పార్టీగా అప్ గ్రేడ్ చేసుకున్నారు. పార్టీ పేరు అప్ గ్రేడ్ చేసుకున్నారే కానీ ఆలోచనలు, విధానాలు అప్ గ్రేడ్ చేసుకోలేదు. దీంతో రెంటికీ చెడిన రేవడిలా మారింది ఆయన పరిస్థితి..పార్టీ పరిస్థితి.
ఆ ఊపులో ఆయన మహారాష్ట్రలో చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ తాను ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఘోరంగా ఓడిపోవడంతో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నా మళ్ళీ అటువైపు చూడలేదు. కనీసం ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదు.
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
కనుక ఆయన 2025 లో రిలీజ్ అయ్యే వరకు బిఆర్ఎస్ పార్టీని బాధ్యతలు చూసుకుంటున్న కేటీఆర్, మహారాష్ట్రలో ‘బాపూ’ చేసిన హడావుడి అంతా మారిచిపోయిన్నట్లు ఎన్నికల ఫలితాలను తమ (కొత్త) కోణంలో నుంచి విశ్లేషించి, ‘దేశానికి ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులు’ అని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని కేటీఆర్ కనిపెట్టి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపికి ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోతుండటం వలననే బీజేపి బలపడుతోందని, అయినా కూడా కాంగ్రెస్, బీజేపిలు దేశంలో ప్రాంతీయ పార్టీలను బ్రతకానీయకుండా నీచ రాజకీయాలు చేస్తున్నాయని, కానీ ప్రాంతీయ పార్టీలతోనే దేశం బలంగా ఉంటుందని ట్వీట్ వేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని, ఝార్ఖండ్ లో బీజేపిని ప్రజలు తిరస్కరించిన్నట్లే అని అన్నారు.
Also Read – హాజరు కోసమే కేసీఆర్ వచ్చారట!
అయితే నేటికీ తమ పార్టీ పేరు బిఆర్ఎస్ పార్టీగానే ఉందనే విషయం కూడా కేటీఆర్ మరిచిన్నట్లున్నారు. బహుశః మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకోవడానికే కేటీఆర్ మళ్ళీ ఈ ప్రాంతీయ పల్లవి అందుకున్నారేమో?