ముందుంది ముసళ్ళ పండగ!

Reliance Jio Offers Latest Newsరిలయన్స్ జియో రంగ ప్రవేశంతో టెలికాం రంగంలో అనూహ్య మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటివరకు ప్రజలను నిట్టనిలువుగా దోచుకున్న కార్పొరేట్ కంపెనీలన్నీ జియో దెబ్బకు తలవంచక తప్పని పరిస్థితి. అయినప్పటికీ తమ వినియోగదారులను అదుపులో ఉంచుకోలేకపోతున్న కంపెనీలకు జియో విడుదల చేస్తున్న ఆఫర్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఇదంతా దాదాపుగా జరిగిపోయిన విషయం. ప్రస్తుతం ఫ్రీ ఆఫర్లు పోయి… పేడ్ ఆఫర్లలో జియో ఉంది… అయితే అవి నామమాత్రమే..!

తాజాగా మార్కెట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… మిగిలి ఉన్న ‘ఎయిర్ టెల్ అండ్ కో’కు ‘ముందుంది ముసళ్ళ పండగ’ అన్న రీతిలో జియో వ్యవహరించబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమ్మర్ సెన్సేషన్ మరియు జియో ధనాధన్ ఆఫర్లు ముగిసిన తర్వాత కేవలం నామమాత్రంగా నెలకు 100 రూపాయలు తీసుకుని, ఫ్రీ కాల్స్, మెస్సేజెస్, డేటాను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో జియో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే దాదాపుగా మిగతా కార్పొరేట్ కంపెనీలన్నీ మూసుకోవాల్సిందే అన్న టాక్ బలంగా వినపడుతోంది.

ADVERTISEMENT

ఇప్పటికే 10 కోట్ల మంది పైనే ప్రైమ్ వినియోగదారులను సొంతం చేసుకున్న జియో, మరో ఏడాదిన్నర్ర పాటు ఇలాగే నామమాత్రపు రుసుముతో దాదాపుగా ఉచిత ఆఫర్లు కొనసాగిస్తే… మిగిలిన నెట్ వర్క్ లో ఉన్న వారు కూడా ఖచ్చితంగా జియో బాట పడతారని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడిదే టెలికాం రంగంలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్ రంగాలలో ఉన్న కార్పొరేట్ సంస్థలు కూడా బిక్కుబిక్కుమంటూ జియో ఎలాంటి బాంబు పేలుస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories