తెలంగాణలో రైతు డిస్కం… మరి ఏపీలో ఎప్పుడు?

Telangana Chief Minister Revanth Reddy announcing farmer-focused electricity DISCOM reforms inspired by Chandrababu Naidu

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా ఏళ్ళ క్రితమే డ్వాక్రా సంఘాలు, రైతు బజార్లు వంటి సమాజానికి ఉపయోగపడే అనేక నూతన వ్యవస్థలు ఏర్పాటు చేసే యావత్ దేశానికే స్పూర్తినిచ్చారు.

ఇప్పుడు అయన రాజకీయ శిష్యుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా అటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసమే ప్రత్యేకంగా ‘తెలంగాణ రైతు విద్యుత్ సరఫరా కంపెనీ (టిఆర్‌పిడిసిఎల్) ఏర్పాటు చేశారు.

ADVERTISEMENT

ఇప్పటి వరకు తెలంగాణలో కూడా అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే వ్యవసాయ విద్యుత్ సరఫరా, కనెక్షన్స్, బిల్లింగ్, మరమత్తులు వగైరా అన్నీ గృహ, పరిశ్రమలు, వాణిజ్య సరఫరా చేసే ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలోనే ఉండేవి. కానీ దాని వలన రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి గుర్తించారు.

గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపొయినా, విద్యుత్ సమస్యలు ఏర్పడినా రైతులు కాళ్ళు అరిగిపోయేలా అధికారులు, సిబ్బంది చుట్టూ తిరగాల్సివస్తోంది. విద్యుత్ సిబ్బందిపై పన్ని ఒత్తిడితో పాటు రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తునందున వారి పట్ల కొంత ఉదాసీనత కూడా ఉంటుంది.

కనుక రైతుల కోసమే ప్రత్యేకంగా పనిచేసే ఒక డిస్కం అవసరమని సిఎం రేవంత్ రెడ్డి భావించి ఏర్పాటు చేయించారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నుంచి ‘టిఆర్‌పిడిసిఎల్’ పని చేసేందుకు సకల ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. వాటితో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కానీ నేటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉంది కదా?

కనుక ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో మాదిరిగానే రైతుల కొరకు ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటు చేస్తే వారికి చాలా మేలు చేసినట్లవుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు కూడా వస్తున్నాయి. కనుక గృహ విద్యుత్ సరఫరా సంస్థలు (డిస్కంలు) నుంచి ఈ రెండింటినీ వేరు చేసి వాటి కోసం ప్రత్యేకంగా రెండు డిస్కంలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories