నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపి మంత్రులు, నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో టీడీపిలో పని చేసినవారే. కనుక ఆయన కూడా నేడు ఎన్టీఆర్‌కి నివాళులు అర్పిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ లేకుండా తుడిచిపెట్టేశారు. దీని కోసం ఆయన ఎన్ని అకృత్యాలు చేశారో అందరికీ తెలుసు. కనుక బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గోతిలో పూడ్చిపెట్టినప్పుడే ఎన్టీఆర్‌కి నిజమైన నివాళులు అర్పించినట్లవుతుంది. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు రాష్ట్రంలోని ఆయన అభిమానులు అందరూ పూనుకోవాలి,” అని విజ్ఞప్తి చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజమని తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాలు చేస్తున్నప్పుడు టీడీపితో సహా అన్ని పార్టీలు బేషరుతుగా మద్దతు ఇచ్చాయి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆయనలో అందరినీ కలుపుకుపోయే ఉద్యమకారుడి స్థానం పక్కా రాజకీయ నాయకుడు బయటకు వచ్చాడు. కేసీఆర్ రాజకీయాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ రాజకీయ నాయకుడు, మొదట ముఖ్యమంత్రిగా తర్వాత క్రమంగా నియంతగా, నిరంకుశంగా మారిపోయారు.
రాష్ట్రంలో ఎవరూ తన అధికారాన్ని ప్రశ్నించరాదని, తన పార్టీకు ఎదురు ఉండొద్దని కాంగ్రెస్, టీడీపిలను నిర్వీర్యం చేశారు. కానీ తాను తుడిచిపెట్టేశానని అనుకున్న ఆ రెండు పార్టీలే అయన గద్దె దించేసి ఫామ్‌హౌసులో కూర్చోబెట్టాయి.
కానీ నేటికీ ఆయన రాక్షస గురువు శుక్రాచార్యుడులా ఫామ్‌హౌసులో కూర్చొని రెండు రాష్ట్రాల మద్య చిచ్చు రాజేస్తూనే ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలంటే ఆ శుక్రాచార్యుడుకి చెక్ పెట్టక తప్పదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
Revanth Reddy’s Message to NTR Fans & CBN Followers
“ తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ను లేకుండా చేసిన చంద్రశేఖర్ రావును, BRS ను 100 మీటర్ల గొయ్యి తీసి బొంద పెట్టినప్పుడే…
నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళి”#KCR pic.twitter.com/6WaSeMUN6H
— M9 NEWS (@M9News_) January 18, 2026






