మళ్ళీ విచారణను ఎదుర్కోనున్న డైరెక్టర్!

RGV God Sex Truth enquiryగతంలో విచారణ సందర్భంగా ఆ సినిమాని పోలెండ్ లో చిత్రీకరించారని, వాస్తవానికి ఆ సినిమాకి తాను దర్శకత్వం వహించలేదని, నిర్మాతలు కోరితే స్కైప్‌ (అంతర్జాల ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం) ద్వారా సూచనలు చేశానంటూ రాంగోపాల్‌ వర్మ వాంగ్మూలమిచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ సినిమా కథ తనదేనని ఫిర్యాదు చేసిన యువకుడు, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు.

మరో ఇద్దరు వ్యక్తులు తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుతూ, జీఎస్టీ సినిమాని హైదరాబాదులోనే చిత్రీకరించారని, మియా మాల్కోవాను హైదరాబాద్‌ రప్పించారని చెబుతూ, పలు సాక్ష్యాలు అందజేసినట్టు తెలుస్తోంది. దీంతో వర్మను మరోసారి విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సారి విచారణలో వర్మ జీఎస్టీ చిత్రీకరణకు పోలెండ్‌ వెళ్లారా? లేదా? అన్నది నిర్ధారించనున్నారు. ఆయన పాస్ పోర్టును కూడా పరిశీలించనున్నారు.

ADVERTISEMENT

అలాగే గతంలో ఈ సినిమాలో అసభ్యత, అశ్లీలతలున్నాయన్న అభియోగాలతో పాటు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గత జనవరిలో నమోదైన కేసుల్లో వర్మను ఫిబ్రవరిలో విచారించిన పోలీసులు, ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించారు. ఈ నివేదిక వచ్చిన అనంతరం వర్మపై చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories