ఇటీవలే గాయం నుండి కోలుకుని, టి-20 వరల్డ్ కప్ చేజిక్కిచుకున్న నాటి నుంచి టీం ఇండియా కు పంత్ తన సేవలను పూర్తి స్థాయి లో అందజేస్తున్నారు. అలాగే, తనకు కంఫర్ట్ జోన్ గా పిలవబడే టెస్ట్ లలో మళ్ళీ 634 రోజుల తరువాత మొన్న ముగిసిన బంగ్లా టెస్ట్ తో రీ-ఎంట్రీ ఇచ్చారు పంత్.
అయితే, ఈ బంగ్లా టెస్ట్ సిరీస్ పూర్తయ్యాక, న్యూజీలాండ్ తో టెస్ట్ ల కు టీం సన్నాయత్తమవుతుంది. కానీ, భారత అభిమానుల చూపులన్నీ నవంబర్ 22 మీదే ఉన్నాయి. ఆరోజున భారత్ కు ఆసీస్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అది కూడా భారత్ ఆస్ట్రేలియా వెళ్లి ఈ సిరీస్ ఆడనుంది. కాగా, ఇప్పటినుండే ఆ సిరీస్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఇరు జట్టులు.
కాగా, గత 4 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లను ముద్దాడింది భారత్. అయితే, 2021 సిరీస్ గెలుపు ఏ భారత అభిమాని ఎప్పటికి మరువరు. అత్యంత బలమైన కంగారులను, భారత్ యువ జట్టు మట్టిగరిపించి 2 -1 తో సిరీస్ ను అందుకున్నారు.ఆ సిరీస్ గెలుపు లో అత్యంత కీలక పాత్ర పోషించాడు ‘రిషబ్ పంత్’.
టీం కష్ట పరిస్థితుల్లో, విరాట్,బుమ్రా,షమీ,జడేజా,అశ్విన్ వంటి వారెవరు జట్టు లో లేని సమయం లో కంగారులను కంగారు పెట్టించాడు పంత్. అయితే, ఐపీఎల్ ప్రభావమో ఏమో కానీ పంత్ ను దగ్గర నుండి గమనించారు ఆసీస్ క్రికెటర్స్. తాజాగా, ఆ దేశపు టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ పంత్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.
“కొన్ని కొన్ని సిరీస్ లలో పంత్ ను కట్టడి చెయ్యడం చాలాకష్టంతో కూడుకున్నది. వాటిలో అతన్ని ప్రభావితం కాకుండా చూడాలి” అప్పుడే ఆటలో విజయం మా వైపు ఉంటుంది అంటూ కామెంట్ చేసారు. అయితే, ఈ పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ లో ఒక పెద్ద పలుకుబడి ఉన్న పేజీ షేర్ చేస్తే, ఏకంగా ‘రిషబ్ పంత్’ ఏ ఆ పోస్ట్ కు లైక్ కొట్టారు.
అలాగే, ఐపీఎల్ తో తన టీం మేట్; ప్రస్తుత ఆసీస్ టి-20 సారధి మిచెల్ మార్ష్ సైతం పంత్ ను ఆకాశానికెత్తేశారు. “పంత్ ఒక ఆస్ట్రేలియన్ అయ్యుంటే బావుండేది, అతను ఓ అద్భుతమైన ఆట తీరు కలిగినవాడు. బయటకు ఎప్పుడు సరదాగా నవ్వుతు కనిపించినా, అతను చాల పోటీతత్వం కలిగిన వాడు, ఎప్పుడు సానుకూలంగా ఆలోచిస్తాడు. ఇప్పుడే ఒక పెద్ద కష్టాన్ని ఎదురుకుని వచ్చాడు, అతనికి ఇంకా చాల కెరీర్ ఉంది” అని వ్యాఖ్యానించారు మార్ష్.
దీని బట్టి, రిషబ్ పంత్ ను ఆసీస్ చాల పెద్ద సమస్య గానే చూస్తున్నారు అని స్పష్టమయింది. పంత్ కూడా ఆస్ట్రేలియా అంటే చెలరేగిపోయి బ్యాటింగ్ చేస్తాడు. 2018 , 2021 లో ఆస్ట్రేలియా వెళ్లి ఆస్ట్రేలియా వాళ్ళనే కంగారు పెట్టినట్టు, మరోసారి పంత్ దెబ్బకు ఆసీస్ కు చుక్కలేనా అని తెలిసేందుకు నవంబర్ 22 వరకు ఆగాల్సిందే.. చూడాలి మరి ఈసారి రిషబ్ పంత్ ఏ మేరకు ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్వదేశీ అభిమానుల అంచనాలను అందుకుంటారో.




