మారేందుకు వేరే పార్టీ ఉందా రోజా మాడమ్?

Roja Selvamani Tirumala Visit After Defeat

మాజీ మంత్రి రోజా ఇదివరకు నెలకు రెండు మూడుసార్లు తిరుమలకి వచ్చేవారు. కానీ ఎన్నికలలో వైసీపి ఓడిపోయిన తర్వాత మొహం చెల్లక తిరుమల దర్శనాలు బంద్ చేశారు.

ADVERTISEMENT

అంటే ఇదివరకు ఆమె శ్రీవారి దర్శనానికే వచ్చేవారా లేక తన అధికార దర్పం ప్రదర్శించుకునేందుకే వచ్చేవారా? అనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ తిరుమల వెంకన్నపై అంత భక్తే ఉంటే ఓడిపోయినా వచ్చేవారు కదా?అనే సందేహం కలుగకమానదు. ఏది ఏమైనప్పటికీ చాలా రోజుల తర్వాత శనివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఎప్పటిలాగే బయటకు రాగానే మళ్ళీ నోటికి పని చెప్పారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను పార్టీ మారుతున్నాననే వార్తలన్నీ కేవలం ఊహాగానాలే. వైసీపి అధికారంలో ఉన్నా లేకపోయినా నేను జగనన్న వెంటే ఉంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదు. అయిన పార్టీలు మారేవారిని ప్రజలు విశ్వసించరు,” అని అన్నారు.

వైసీపిలో నోటి దురద చాలా ఎక్కువ ఉన్న రోజా, కొడాలి నాని, అంబటి వంటి కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, వైఎస్ షర్మిల అందరినీ నోటికి వచ్చిన్నట్లు అవహేళన చేశారు. కనుక వారికి అన్ని పార్టీల తలుపులు మూసుకుపోయాయని చెప్పవచ్చు.

కనుక వారికి ఇష్టమున్నా లేకపోయినా జగన్‌ వెంట వైసీపిలోనే ఉండక తప్పదు లేదా కొంతమంది వైసీపి నేతల్లాగా రాజకీయాల నుంచి తప్పుకోవలసి ఉంటుంది. కానీ రోజాకి ఇంకా రాజకీయాలలో కొనసాగే ఉద్దేశ్యం ఉంది గానీ వేరే ఆప్షన్ లేదు కనుకనే ఈవిదంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు.

గతంలో ఆమె పలు తమిళ సినిమాలలో కూడా నటించారు. ఆమె భర్త తమిళ దర్శకుడు. కనుక తమిళనాడులో కూడా రోజాకి రాజకీయ అవకాశాలున్నాయి. తమిళ హీరో విజయ్‌ స్థాపించిన పార్టీలో చేరేందుకు రోజా ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే వైసీపి బ్యాక్ గ్రౌండ్ చూశాక తమిళనాడులోనైనా ఎవరైనా ఆమెను తమ పార్టీలో చేర్చుకునే సాహసం చేస్తారా… ఏమో? ఒకవేళ చేర్చుకుంటే రెండు దేశాల పౌరసత్వం కలిగిన్నట్లు రెండు రాష్ట్రాలలో అవకాశాన్ని బట్టి రోజా అటూ ఇటూ మారుతుండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories