ఆంధ్రజ్యోతిని తగలబెట్టేస్తాం…రోజా

Roja vs ABN: Remarks Spark Fresh Political Storm

వైసీపీ మహిళా నేత, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తమకు సంస్కారం అడ్డొస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు వైసీపీ కి సంస్కారం అనే పదానికి అర్ధం తెలుసా.? అసలు ఆ పార్టీ నేతలకు సంస్కారం అనే పదం పలకడానికి అర్హత ఉందా.? సంస్కారం గురించి సాక్షి కి తెలుసా.? అంటూ రోజా వ్యాఖ్యల పై కామెంట్స్ మొదలయ్యాయి.

అసలు విషయానికొస్తే ABN లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే పేరుతో వచ్చే కార్యక్రమం లో ABN రాధా కృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని మీడియా ముందుకొచ్చిన రోజా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి, ఆ పత్రిక ఎండీ ఆర్కేకు తన సంస్కరమైన భాషతో వార్నింగ్ ఇచ్చారు.

ADVERTISEMENT

జగన్ మావిగన్ ప్రకటన, అందుకు వైసీపీ బ్యాచ్ మద్దతు ను ఉద్దేశించి ABN వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమం లో తమ ఇంటి ఆడవాళ్లను ఆర్కే అవమానకరంగా మాట్లాడారంటూ, ఆ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు రోజా.

చంద్రబాబు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బాబు రాసిచ్చే రోత రాతలను రాస్తూ, ఆయన ఇస్తున్న బూతు మాటలను ప్రచారం చేస్తూ, విష పత్రిక లా వైసీపీ మీద విషం చిమ్ముతున్నావ్, ఇవి ఇక్కడితో ఆపకపోతే మహిళలందరం కలిసి నీ కొవ్వు దించుతాం అంటూ రోజా చాల సంస్కారవంతమైన భాష వినియోగించారు.

ఇక అక్కడితో ఆగితే అది వైసీపీ సంస్కారం ఎలా అవుతుంది అనుకున్నారో ఏమో కానీ, వారి పార్టీకి అలవాటైన రోత రాజకీయాన్ని బయటకు తీశారు. అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని మహిళలను రాజకీయ విమర్శలలోకి లాగారు.

ఇందుకు గాను రాధాకృష్ణ కుమార్తె, బాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి, పవన్ భార్య అన్నా లెజినోవా, ఇక ప్రభుత్వంలోని ఇతర మంత్రుల భార్యల టార్గెట్ గా రెచ్చిపోయారు రోజా. వారందరిని ఉద్దేశిస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు మమ్మల్ని తిట్టేస్తే మాకు తిట్టడం చేతకాదనుకున్నారా.?

కేవలం మా సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంతే, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టే ఇక్కడితో ఆడుతున్నాం అంటూ అసలు ఈ వివాదానికి అసలు సంబంధం లేని వారిని వివాదంలోకి లాగి వారి పై విమర్శలు చేసారు ఈ మహిళా నేత.

అలాగే ఇంకోక్కసారి ఇలా మహిళల పై తప్పుడు రాతలు రాసినా, వారిని కించపరిచేలా కథనాలు ప్రచారం చేసినా ఆంధ్రజ్యోతిని తగలపెట్టేస్తాం అంటూ రోజా ABN రాధాకృష్ణకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి రోజా హెచ్చరికలకు ప్రతిస్పందన కోసం వీకెండ్ కామెంట్ బై ఆర్కే వరకు ఆగాలా.? లేదా బ్రేకింగ్ అంటూ వెంటనే కౌంటర్ వచ్చేస్తుందా.?

అయితే మహిళల పై ABN లో అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ రెచ్చిపోతున్న రోజా కు అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షిలో వచ్చిన వేశ్యల అనే పదం పై జరిగిన వివాదం రోజా కి వినిపించలేదా.? కనిపించలేదా.? అంటే మహిళలందు వైసీపీ మహిళలు వేరు అనేది రోజా రాజకీయ ఉద్దేశమా.? లేదా అసలు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు వైసీపీ దృష్టిలో మహిళల జాబితాలోకి వెళ్ళారా.? అనేదాని పై కూడా రోజా స్పష్టత ఇస్తే బాగుటుందేమో..!

ADVERTISEMENT
Latest Stories