రాయల్ ఎన్‌ఫీల్డ్, స్టీల్ ప్లాంట్‌ అన్నీ రాయలసీమకే… అవసరమే!

Royal Enfield manufacturing unit and JSW Steel plant projects announced for Rayalaseema development in Andhra Pradesh

రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? అంటే మూడు రాజధానులని వైసీపీ నేతలు చెప్పేవారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలని కూటమి ప్రభుత్వం చెపుతోంది. కనుక దేంతో ఆ జిల్లాలు అభివృద్ధి చెందుతాయో ప్రజలే తీర్పు చెప్పారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాయలసీమకి వరుసపెట్టి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తూనే ఉంది.

ADVERTISEMENT

తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడు వద్ద రూ.2,200 భారీ పెట్టుబడితో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ మోటార్ సైకిల్ తయారీ పరిసశ్రమ ఏర్పాటుకాబోతోంది. ఏడాదికి 9 లక్షల వాహనాలు తయారు చేసేందుకు వీలుగా ఈ పరిశ్రమని 267 ఎకరాలలో ఏర్పాటు కాబోతోంది. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ సంస్థ 1901లో తమిళనాడులో ఈ పరిశ్రమ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి రాష్ట్రం వెలుపల ఎక్కడా మరో చోట ఏర్పాటు చేయకుండా తమిళనాడుకే పరిమితమైంది.

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రెండో యూనిట్ ఏర్పాటుకాబోతోంది. ఈ స్థాయిలో వాహనాల ఉత్పత్తి చేసేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 5,000 మంది ఉద్యోగులు అవసరమని ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ప్రతినిధులు చెప్పారు. దీని మొదటి దశ నిర్మాణ పనులు 2029లోగా రెండో దశ పనులు 2032లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు మొదలుపెడుతోంది.

వైసీపీకి కడప జిల్లా కంచుకోట కానీ కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టుకోవడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో సున్నపు రాళ్ళపల్లి గ్రామం రూ. కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశలలో నిర్మిస్తోంది.

మొదటి దశలో ఏడాదికి 10 లక్షల టన్నులు, రెండో దశలో మరో 10 లక్షల టన్నులు కలిపి మొత్తం 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ నెల నుంచి దీని నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు.

మొదటి దశ పరిశ్రమ నిర్మాణ పనులు 2029లోగా పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇదికాక రాష్ట్రంలో సుమారు మరో డజను స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories