5 రూపాయలకే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్!

internet-rs5-per-hourఅత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి తరంలో ఓ చిన్న వినూత్న ఆలోచన, ఏకంగా జీవన గమనాన్ని ఎలా మార్చుతుందో తెలిపేందుకు ఒక చక్కని ఉదాహరణ ఈ ఉదంతం. రోజుకు 100 టీలు అమ్ముకుని జీవనం సాగించే కర్ణాటకలోని సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సాయీద్ ఖాదర్ బాషా అనే యువకుడికి చక్కటి ఆలోచన వచ్చింది.

ADVERTISEMENT

తన టీ స్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని, ఓ ఇంటర్నెట్ రూటర్ ను పెట్టి, ఐదు రూపాయలు పెట్టి టీ తాగిన వారందరికీ 30 నిమిషాల వైఫై సిగ్నల్స్ ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ ఆలోచన సూపర్ హిట్ అయింది. 10 నుంచి 15 మంది వరకూ 2 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వాడుకునే సౌకర్యం ఇక్కడ ఉండటంతో టీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

అంతకుముందు రోజుకు దాదాపుగా 100 టీలు అమ్మిన సయీద్, ఇపుడు ఏకంగా రోజుకు 500 టీలు అమ్మే స్థాయికి చేరుకున్నాడు. దీంతో స్థానికంగా కూడా సయీద్ ఎంతో ప్రజాధరణ పొందుతూ, ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా, ఉదయ్ పూర్, వడోదరలకు చెందిన మరో ఇద్దరు చాయ్ వాలాలు కూడా ఇలాంటి ఆలోచనలే చేసి విజయం సాధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories