ట్రైలర్ టాక్ – ‘డ్యామేజ్ కంట్రోల్’ ప్రయత్నం!

Saahasam Swaasaga Saagipo Trailer Talk - Naga Chaitanyaఅక్కినేని నాగచైతన్య వ్యక్తిగత మరియు సినీ కెరీర్ జీవితాలు ప్రస్తుతం మలుపు తిరిగే స్టేజ్ లో ఉన్నాయి. ఓ పక్కన సమంతతో వివాహం నిశ్చయం కావడంతో తన వ్యక్తిగత జీవితంలో అతి పెద్ద మలుపుగా చెప్పవచ్చు. అలాగే ఇటీవల వచ్చిన ‘ప్రేమమ్’ సినిమా సక్సెస్ సాధించడంతో అన్ని రకాలుగా ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎప్పుడో విడుదల కావాల్సిన “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ADVERTISEMENT

‘ఏ మాయ చేసావే’ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడడంతో, పూర్తిగా ప్రేక్షకుల ఆసక్తికి దూరమైంది. ఎప్పుడో విడుదలైన ఏఆర్ రెహమాన్ స్వరపరచిన పాటలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉండడంతో, ఆడియో పరంగా కూడా ఎలాంటి గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. దీంతో ఇటీవలే ఫ్రెష్ గా మళ్ళీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. అందులో భాగంగా తాజాగా రెండవ ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసాడు చైతూ.

‘ఏ మాయ చేసావే’ సన్నివేశాల మాదిరి కనపడుతున్న రొమాంటిక్ సీన్లు పర్వాలేదనిపించినప్పటికీ, లవ్ లో యాక్షన్ సన్నివేశాల మిళితం, సినిమా కధను, ప్రేక్షకుల మూడ్ ను డైవర్ట్ చేసినట్లుగా కనపడుతోంది. ఈ ట్రైలర్ వలన పెద్దగా ఉపయోగం ఉంటుందో లేదో గానీ, సినిమానైతే ఈ నెల 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలైతే చాలు అనుకున్న అక్కినేని అభిమానులకు మాత్రం ఈ విడుదల వార్త ఊరటనిచ్చే అంశం. ‘డ్యామేజ్ కంట్రోల్’ కోసం ఫ్రెష్ గా వచ్చిన ఈ ట్రైలర్ పై ఓ కన్నేయండి..!

ADVERTISEMENT
Latest Stories