వైరల్ : సచిన్ కుమార్తె సారా ఫోటో!

Sachin Tendulkar Daughter - Sara Latest Photo Viral‘అతిలోకసుందరి’ శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి త్వరలోనే దర్శకుడు కరణ్ జోహార్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ ఇప్పటికే తన లవ్ ఎఫైర్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. వీరిద్దరి ప్రేమకు శ్రీదేవి కుటుంబ సభ్యుల నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందనే విధంగా, ఏకంగా శ్రీదేవి పక్కన ఉన్న ఫోటోలు కూడా గతంలో చక్కర్లు కొట్టాయి.

ఇదిలా ఉంటే… ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఓ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ఫ్రాంచైజీ యజమాని ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు మరియు ఇతర క్రికెటర్లు హాజరయ్యారు. ఈ పార్టీకి జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలసి వచ్చింది.

ADVERTISEMENT

వీరందరితో పాటు ‘క్రికెట్ దేవుడు’గా భావించే ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా కూడా విచ్చేసింది. ఈ సందర్భంగా జాహ్నవి బాయ్ ఫ్రెండ్ శిఖర్, సచిన్ కూతురు సారాపై చేయి వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ సెలబ్రిటీలకు ఇదంతా సర్వసాధారణమే అయినా, సచిన్ తనయురాలు సారాపై చేయి వేయడమే హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

ADVERTISEMENT
Latest Stories