సాయిరెడ్డి కి క్లారిటీ ఉంది…మరి ప్రజలకి..?

Sai Reddy discussing political clarity and his future plans

విజయసాయిరెడ్డి ని జగన్ ను విడదీసి చూడలేని రోజుల నుంచి సాయి రెడ్డి జగన్ పై ఆరోపణలు చేసే స్థాయికి వైసీపీ లో రాజకీయం రంగు మారింది.

పార్టీలో జగన్ తరువాత స్థానం సాయి రెడ్డి దే, కొన్ని కొన్ని సందర్భాలలో జగన్ సైతం సాయి రెడ్డి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయాల్సిందే అనేంతలా వైసీపీ తో పాటు ఇతర పార్టీల నేతలు నమ్మేవారు.

ADVERTISEMENT

అటువంటి సాయి రెడ్డి ని కాదని జగన్ తన చుట్టూ ఒక కోటరీని నిర్మించుకున్నారా.? ఆ కోటరీ రాజకీయ ఉచ్చులో సాయిరెడ్డి జగన్ కు దూరమయ్యారా.? అంటే సాయి అవుననే అంటున్నారు.

తానూ వైసీపీ ని వీడడానికి, రాజకీయాలకు వాలంటరీ రిటైర్ మెంట్ ప్రకటించడానికి ముఖ్య కారణం జగన్ ను చుట్టుముట్టిన కోటరీనే అంటున్నారు సాయి. అలాగే వైసీపీ పతనానికి మూల కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఘాడమైన ప్రేమను కురిపిస్తున్నారు.

తానూ ఇంతవరకు ఎప్పుడు పవన్ ను విమర్శించలేదని, ఇకముందు కూడా ఆ విమర్శించబోనని, ఇది తన దృఢ సంకల్పం అంటూ ప్రకటించిన సాయి తనకు పవన్ కు మధ్య 20 ఏళ్ళ సాన్నిహిత్యం ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, తానూ కూడా ఏ పార్టీలో చేరేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేనని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతానికి నేను రైతునే అయినప్పటికీ భవిష్యత్ లో అవసరం అనుకుంటే తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అంటూ ప్రకటించారు. అయితే ఆ పొలిటికల్ ఎంట్రీ అనేది తన కొత్త పార్టీ తోనా, లేక పాత పరిచయాలతో అనేదాని పై సాయి రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ఇక్కడ సాయిరెడ్డి తానూ క్లారిటీగా ఉండి ప్రజలకు క్లారిటీ ఇవ్వలేదా.? లేక భవిష్యత్ పై తనకే ఒక పూర్తి స్పష్టత లేదా అన్నది ఆలోచించదగ్గ అంశం. సాయి రెడ్డి మాటలు గమానిస్తే తానూ ఇప్పటికి జగన్ ను తన నాయకుడిగానే భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

తనకు జగన్ కు మధ్య ఉన్న కోటరీ గోడలు బద్డలితే తనకు జగన్ తో కలిసేందుకు అభ్యంతరం లేదనేలా, వైసీపీ తో కలిసి నడిచేందుకు సిద్దమే అన్నట్టుగా తనకు జగన్ కు మధ్య అడ్డుగా నిలిచింది కోటరీ నే అంటూ మరోసారి కోటరీ ని బలంగా నొక్కి వక్కాణించారు.

అయితే ఇక్కడ సాయి రెడ్డి జగన్ కు భయపడుతున్నారా.? లేక వైసీపీ ఓటమితో తన పై బిగియనున్న అవినీతి ఉచ్చును తప్పించుకునేందుకు ఇలా వైసీపీ కి దూరంగా జరిగారా.? రేపటి రోజున తిరిగి వైసీపీకి సాయి రెడ్డి అవసరం ఏర్పడితే రెడ్డి గారు మరోసారి వైసీపీ రథచక్రం మోసేందుకు ముందుకొస్తారా.?

అందులో భాగంగానే అలాగే కూటమి పాలన పై కానీ వైసీపీ ప్రతిపక్షం పై కానీ రివ్యూ ఇచ్చేందుకు సుముఖత చూపలేదా.? ఇది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళిక పై వేసిన వ్యూహమా.? లేక రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనే సాయిరెడ్డి ముందు చూపుకి నిదర్శనమా.?

ఇటువంటి అన్ని అంశాల పై సాయిరెడ్డి కి పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ ఆ క్లారిటీ ప్రత్యర్థి పార్టీలకు గాని ప్రజలకు కానీ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరనే విషయం సుస్పష్టం.

ADVERTISEMENT
Latest Stories