నాడు సజ్జల సలహాలు – నేడు సాయి సత్యాలు

Sai Reddy during ED investigation

ఒక్కప్పుడు వైసీపీ రాజకీయం మొత్తం వైస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూనే తిరిగేది. కనై పార్టీలోకి సాయి రెడ్డి ఎంట్రీతో జగన్ కు సమానంగా సాయి రెడ్డి కూడా పార్టీలో కీలక పాత్ర పోషించారు.

2019 వైసీపీ విజయంలో నాడు బీజేపీ తో సాయి జరిపిన తెరచాటు మంతనాలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే వైసీపీ లో అంతటి ప్రాధాన్యం జగన్ దగ్గర అంత స్వతంత్ర ఉన్న సాయిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాస్త కాస్తగా జగన్ కు దూరమవుతూ వస్తున్నారు.

ADVERTISEMENT

ఇక అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా, జగన్ కు అత్యంత ఆప్త మిత్రుడిగా మారిపోయారు సజ్జల రామకృష్ణ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ సలహాదారుగా నియమితమైన సజ్జల ఒకరకంగా జగన్ క్యాబినెట్ లో సకల శాఖ మంత్రిగా మారిపోయారు.

నాటి సజ్జల సలహాలు 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ని 11 కి తెచ్చాయి. అంటే సజ్జల సలహాలతో ఐదేళ్ల పాటు సాగిన జగన్ పాలన ప్రజలలో వైసీపీ పట్ల ఎంతటి వ్యతిరేకతను తీసుకొచ్చిందో స్పష్టంగా తెలుస్తుంది. సజ్జల సలహాలు ఇటు ప్రజలలోనే కాదు అటు పార్టీలో అంతర్గతంగా కూడా ఎంతోమంది అసహనానికి కారణమయ్యింది.

వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ సాయి రెడ్డి. సజ్జల రక మునుపు వరకు వైసీపీ లో నెంబర్ 2 గా చెలామణి అయిన సాయి సజ్జల ఎంట్రీ తో సాయి రెడ్డి వైసీపీ నుంచి ఎగ్జిట్ అవ్వక తపప్లేదు. తన ఈ నిష్క్రమణ వెనుక జగన్ ను చుట్టూ ముట్టిన కోటరీ ఉందంటూ సాయి వైసీపీ తెరవెనుక సత్యాలను బయటకు తెస్తున్నారు.

తాజాగా వైసీపీ కి అత్యంత కీలకమైన లిక్కర్ కేసులో సాయి రెడ్డి నేడు ఈడీ విచారణను ఎదుర్కుంటున్నారు. ఈ విచారణలో సాయి అన్ని సత్యాలే చెపితే నాడు సజ్జల సలహాలతో వైసీపీ ఎంతటి రాజకీయ పతనాన్ని చూసిందో నేడు సాయి రెడ్డి సత్యాలతో అంతకు మించిన పాతాళాన్ని చూడక తప్పదు.

ఇప్పటికే సాయి రెడ్డి ఈ కేసులో నేను కేవలం విజిల్ బ్లోయర్ ని మాత్రమే అంటూ ప్రకటించుకుని కేసు తనదాకా వస్తే ఇక ఆ తరువాత పరిణామాలను ఎలా ఉండబోతున్నాయి అనేదాని పై వైసీపీ కి ఒక పరోక్ష హెచ్చరిక కూడా చేసారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణలో సాయి రెడ్డి ఎం చెప్పబోతున్నారు నేడు అటు వైసీపీ తో పాటు ఇటు కూటమి కూడా ఆసక్తిగా గమనిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories