పబ్లిసిటీ కాదు… హృదయం చలించి చేసాను..!

Sampoornesh babu interview hudhud strom vizagతెలంగాణకు చెందిన వాడైనా ఆంధ్రప్రదేశ్ సినీ అభిమానుల మన్నన పొందిన నరసింహాచారి కం సంపూర్ణేష్ బాబు, వైజాగ్ ను హుదూద్ తుపాను సర్వనాశనం చేసినప్పుడు కూడా తన వంతుగా ఆర్థిక సాయం చేశాడు. పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే సంపూ ఈ పని చేశాడన్న టాక్ అప్పట్లో హల్చల్ చేసింది. అయితే దీనిపై సంపూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకున్నాడు.

తాను పబ్లిసిటీ కోసం ఇది చేయలేదని, తుఫాన్ తర్వాత వైజాగ్ పరిస్థితిని చూసి చలించిపోయానని, అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. వాస్తవానికి అప్పటికీ తన దగ్గర అంత డబ్బు అప్పుడు లేదని… అందుకే రెండు వారాల సమయం తీసుకుని, అప్పు చేసి ఆ డబ్బును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించానని చెప్పాడు.

ADVERTISEMENT

అలాగే ఏపీకి ప్రత్యేక హోదా రావాలని తాను కోరుకున్నానని… జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ఉత్తేజితుడిని అయ్యానని… అందుకే వైజాగ్ లో జరిగే నిరసన దీక్షకు వస్తానని చెప్పానని… మాటకు కట్టుబడి అక్కడకు వెళ్లానని సంపూ తెలిపాడు. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్దే తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని… అక్కడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో తనను బంధించారని చెప్పాడు.

సాయంత్రం 5 గంటలకు రిటర్న్ విమానం టికెట్ బుక్ చేసుకున్నానని… దీంతో తనను ఎప్పుడు విడిచి పెడతారంటూ పోలీసులను అడిగితే… మాకు తెలియదండీ, కమిషనర్ గారు మీ మీద చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత 7 గంటల సమయంలో తనను విడిచి పెట్టారని, దీంతో రాత్రి 10 గంటల ఫ్లైట్ కు హైదరాబాద్ వచ్చానని, ఇవన్నీ తాను ఎంతో నిజాయతీగా చేశానని… పబ్లిసిటీ కోసం కాదని అన్నాడు.

ADVERTISEMENT
Latest Stories