Satyam Sundaram Rajinikanth

‘సత్యం సుందరం’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన కార్తీ తన సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఒక ఫీల్ గుడ్ మూవీ గా ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు అయితే నవ్వు లేదా భావోద్వేగం అంటూ హీరో నాగార్జున సత్యం సుందరం మూవీ టీం కు తన శుభాకాంక్షలు తెలియచేసారు.

హీరో కార్తీ కూడా మూవీ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా.? అన్న చిన్న అనుమానం ఉండేది కానీ దాన్ని పూర్తిగా మార్చేశారు సినీ ప్రేక్షకులు అంటూ తన ఆనందాన్ని మీడియా మిత్రుల తో కలిసి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇది సక్సెస్ మీట్ లాగ లేదని తనకు ఒక ఫామిలీ ఫంక్షన్ కు వచ్చినట్లు ఉందంటూ ధన్యవాదాలు తెలియచేసారు.

Also Read – 2027లో జమిలి ఎన్నికలు… చంద్రబాబు నాయుడు సై?

ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. అయితే రజనికి హృదయ నాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మీద అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనితో రజని ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది అంటూ ఆసుపత్రి వర్గాలు ప్రకటన రూపంలో అభిమానుల ఆందోళనను శాంతిపచేసారు.

‘అమ్మ మనస్సు’ అంటూ జనసేన అంజనాదేవితో ఒక స్పెషల్ ఇంటర్ వ్యూ ప్రోమోను తన సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిలో ఆమె పవన్ రోడ్డు మీద నిరసనకు దిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఆ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని, పవన్ కు చిన్నప్పటి నుంచి పట్టుదల కాస్త ఎక్కువే అని, ఏదైనా అనుకుంటే అది నెరవేరే వరకు వదిలిపెట్టాడని పవన్ ముచ్చట్లు వెల్లడించారు.

Also Read – ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!

దీనితో ఈ పూర్తి కార్యక్రమం ఎప్పుడు మీడియాలో వస్తుందా అంటూ జనసైనికులతో పాటుగా మెగా ఫాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక నాని, ఎస్ జే సూర్య ప్రత్యర్థులుగా నటించిన సరిపోదా శనివారం అటు వెండి తెర మీదే కాదు ఇటు బుల్లితెర మీద కూడా తన హావ కొనసాగిస్తూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్టీమ్ అవుతుంది.




Also Read – సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటే చాలా?