ys-sharmila-reddy

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో ఏవిదంగా వ్యవహరించారు.. వ్యవస్థలని భ్రష్టు పట్టించేసి ఏవిదంగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు? జగన్‌ హయంలో ఏ స్థాయిలో అరాచకాలు జరిగాయి? ఆర్ధిక వ్యవస్థ ఏవిదంగా చిన్నాభిన్నమైంది?అనేవి రాష్ట్రానికి, సమాజానికి సంబందించిన విషయాలు.

Also Read – వైసీపీ చీకటి మెయిల్స్…

కానీ జగన్‌ తన స్వార్ధం కోసం సొంత కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ముందుగా బాబాయ్ వివేకానందరెడ్డిని పైకి పంపించేశారని సొంత చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతారెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ముందుగా చెల్లి షర్మిలను, ఆ తర్వాత తల్లి విజయమ్మని బయటకు గెంటేశారు. అక్కడితో తమని జగన్‌ విడిచిపెట్టలేదని, తాను తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే అక్కడ కూడా కేసీఆర్‌ సాయంతో తమని జగన్‌ వెంటాడి వేధించారని షర్మిల చెప్పుకొని బాధపడ్డారు.

Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?

ఆమె నిన్న విశాఖలో పర్యటించినపుడు మీడియాతో మాట్లాడుతూ, “నేను తెలంగాణకు వెళ్ళిపోయి అక్కడ రాజకీయాలు చేసుకుంటున్న నన్ను, మా అన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌తో కలిసి తొక్కేయాలని చూశారు.

తోడబుట్టిన చెల్లెలు కంటే కేసీఆరే ముఖ్యమనుకున్నారు. రక్త సంబంధం కంటే కేసీఆర్‌తో రాజకీయ సంబంధమే ముఖ్యమని భావించడం వల్లనే నన్ను తొక్కేయాలనుకున్నారు. నా రాజకీయ జీవితాన్ని దెబ్బ తీశారు. నేను ఆర్ధికంగా సమస్యలలో కూరుకుపోయేలా చేశారు.

Also Read – జగన్ చదరంగంలో పావులెవరు.?

నా ఫోన్‌, నా భర్తది, నాతో ఉన్నవాళ్ళ అందరి ఫోన్లను కేసీఆర్‌ ట్యాపింగ్ చేయించి మేము ఏం చేస్తున్నాము? మాతో ఎవరెవరు మాట్లాడుతున్నారు? వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకొని జగన్‌కి అందించేవారు.

మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, ఆ ఆడియో సంభాషణలు జగన్‌కు చేరుతున్నాయనే విషయం వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నాకు తెలియజేశారు. ఆయన మా సంభాషణల రికార్డింగ్ నాకు వినిపించినప్పుడు నేను షాక్ అయ్యాను.

ఆయితే అప్పుడు జగన్‌, కేసీఆర్‌ కలిసి నన్ను రాజకీయంగా వేధిస్తున్నప్పుడు ఒకే సమయంలో నేను అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. అప్పుడున్న పరిస్థితులలో నేను ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపెట్టి మరో పోరాటం చేయలేని నిసహాయస్థితిలో ఉన్నందున మౌనంగా ఉండిపోవలసి వచ్చింది.

మా అందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని నేను బైబిల్ మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. ఇప్పుడు సిట్ విచారణకు పిలిస్తే తప్పకుండా వెళ్ళి నాకు తెలిసిన ఈ విషయాలన్నీ చెపుతాను. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారాయి.

మారిన ప్రభుత్వాలలో సిఎం చంద్రబాబు నాయుడు, సిఎం రేవంత్ రెడ్డిలతో సహా వారి పార్టీలో నాయకులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులే. కనుక ఇకనైనా ఈ కేసులో దోషులకు శిక్ష పడేలా చేయాలి,” అని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు.