కమిటీలు వేసేస్తే నదులు అనుసంధానం అయిపోయి నీళ్లు వచ్చేస్తాయా వీర్రాజుగారూ!

Somu Veerrajuగురువారం మండలిలో ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. పట్టిసీమ దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు అని, నదుల అనుసంధానం మొదలు పెట్టిన ఘనత చంద్రబాబుదే అని డబ్బా కొట్టుకుంటున్నారని, .నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు.

వాజ్‌పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్‌ ప్రభు నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజమే నదుల అనుసంధానం చేసి కరువు లేకుండా చెయ్యడమే తన కల అని అప్పట్లో వాజపేయి చెప్పేవారు. అయితే ఆయన ఆ దిశగా ఏమీ చెయ్యడానికి సమయం లేదు 2004లో ఓడిపోవడంతో.

ADVERTISEMENT

టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుతోనే నదులు అనుసంధానం అయిపోయి నీళ్లు వచ్చేస్తాయని వీర్రాజు అనుకుంటున్నారేమో మరి. వాజపేయి కలల ప్రాజెక్టుకు దాదాపుగా నాలుగు ఏళ్లగా మోడీ ప్రభుత్వం చేసింది ఏంటో, ఖర్చు పెట్టింది ఎంతో కూడా చెబితే బావుంటుంది. పేరు గొప్పా ఊరు దిబ్బా ల ఉంది వ్యవహారం!

ADVERTISEMENT
Latest Stories