గాలి జనార్దన్‌రెడ్డి లాంటివారిని మార్చే ప్రయత్నం చేస్తాదంట బీజేపీ

Somu -Veerraju  comments on Gali Janardhan Reddyబీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సొంతవారిని సమర్ధించుకోవడానికి ఎదుటివారిని విమర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అధ్యక్ష పదవి ఇవ్వలేదని అలిగి ఏటో వెళ్లిపోయిన ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలుగు దేశం పార్టీపై విమర్శనాస్త్రాలు ప్రయోగించడం మొదలు పెట్టారు.

అయితే ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన అధ్యక్ష పదవి గురించి, కాంగ్రెస్ నుండి వచ్చిన కన్నాకు పదవి ఇవ్వడంపై ఆయన అభిప్రాయాన్ని మీడియా మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. దీనితో ఆయన కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులకు తమ భావజాలం ఎక్కిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికలలో గాలి జనార్ధనరెడ్డి అనుచరులకు టిక్కెట్లు ఇవ్వడంపై అడిగితే గాలి జనార్దన్‌రెడ్డి లాంటివారిని మార్చే ప్రయత్నం చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. గాలి అనేక అక్రమాలు చేసిన సమయంలో ఆయన బీజేపీలోనేగా ఉన్నది. అప్పుడు ఆపలేని వారు ఇప్పుడు మారుస్తారా?

ADVERTISEMENT
Latest Stories