ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకోవడం, వీలైనన్ని చిన్న సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లకి గెస్టుగా వెళ్లడం, బన్నీ వాసు, వంశీ నందిపాటిలు విడుదల చేసే రోస్ట్ ఈవెంట్లకి చీఫ్ గెస్ట్ గా వెళ్లడం, ఎవ్వరికీ కనిపించకుండా ఫ్యామిలీ ట్రిప్పులు వేయడం తప్ప ఎలాంటి గాసిప్పులకి, కాంట్రవర్సీలకి తావు ఇవ్వని వ్యక్తి శ్రీవిష్ణు.
గతంలో “సింగిల్” సినిమాలో శివయ్యా అనే డైలాగ్ తో మంచు విష్ణు హర్ట్ అయ్యాడని తెలిసి, బేషరతుగా క్షమాపణ చెప్పాడు, అంతకంటే ముందు “వీరభోగ వసంతరాయులు” సినిమా విషయంలోనూ డైరెక్టర్ కాస్త ఓవర్ యాక్షన్ చేసి రివ్యూ రైటర్స్ ని పబ్లిక్ గా సోషల్ మీడియా వేదికగా తిట్టిపోయగా, దానికి కూడా శ్రీవిష్ణు వెంటనే సారీ చెప్పేసి, నాకేం సంబంధం లేదు అని ఆ గొడవ నుండి కూడా బయటపడ్డాడు.
అలాంటి శ్రీవిష్ణు తన ప్రమేయం లేకుండా ఓ సమస్యలో ఇరుక్కున్నాడు. శ్రీవిష్ణు తాజా చిత్రం “మృత్యుంజయ” గతవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాకి ఓటీటీలో ఆశించిన స్థాయి రిసెప్షన్ లభించలేదు. అయితే.. సినిమాలోని ఒక సీన్ లో క్రైమ్ సీన్ బోర్డ్ మీద మోడీ ఫోటోతో “బ్యాంక్ ఫ్రాడ్” అనే టైటిల్ తో ఒక పేపర్ కటింగ్ ని గుర్తించారు కొందరు సోషల్ మీడియా మెంబర్స్. దాంతో డైరెక్టర్ కావాలనే మోదీని కించపరచాలని ఇలా చేశాడని, అసలు సీన్ కి ఏమాత్రం సంబంధం లేని ఆ సన్నివేశానికి, మోడీ ఫోటో అవసరం ఏముందని నిలదీస్తున్నారు.
అయితే.. ఇక్కడ అనవసరంగా శ్రీవిష్ణుని ఆడిపోసుకుంటున్నారు జనాలు. తనకి సంబంధం లేని ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసి చిన్న తప్పుకి శ్రీవిష్ణుని ఇలా ఆడుకోవడం అనేది సమంజసం కాదు. ఈ విషయం టీమ్ మెంబర్స్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆ క్లిప్ ని బ్లర్ చేయడమో లేక కట్ చేయడమో కానీ చేస్తే బెటర్.




