అదానీ దెబ్బ నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్….

sensex

గత కొన్ని రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్ బేర్ దిశగా నేల చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు) భారీగా షేర్ల అమ్మకాలు కొనసాగించడంతో దేశీయ మర్కెట్లు నష్టాలలో ట్రేడ్ అవుతున్నాయి.

ఈ ఎఫ్ఐఐ ల వరుస అమ్మకాలతో భారతీయ షేర్ మార్కెట్లు ఒక్కసారిగా పతనం దిశగా పరుగులు పెట్టి దాదాపు ప్రతి షేర్ వాల్యూ లో కూడా 10 % పైన కరెక్షన్ నమోదయ్యింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి నుండి కాస్త ఉపశమనం దక్కిందిలే అనుకునే లోపే అదానీ ఇష్యూ మరోసారి మన దేశీయ మార్కెట్లను ఎరుపెక్కించాయి.

ADVERTISEMENT

దీనితో నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ షేర్స్ దాదాపు 20 % కరెక్షన్ అయ్యింది. ఈ దెబ్బ సెన్సెక్స్ , భారతీయ నిఫ్ట్య్ మీద కూడా కొనసాగడంతో నిన్న ఇండియన్ షేర్ మార్కెట్ బుల్ దిశగా పరుగులు పెట్టలేకపోయింది. అయితే నిన్న నష్టాల నుండి కోలుకున్న అదానీ షేర్ నేడు లాభాల బాట పట్టడంతో దేశీయ మార్కెట్లో కూడా బుల్ తన జోరు చూపించింది.

సెన్సెక్స్ 1019 పాయింట్లు ఎగబాకితే, నిఫ్ట్య్ 321 పాయింట్లు ప్లస్ తో క్లోజ్ అయ్యాయి. సూచీలు అనూహ్యంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద నేడు సుమారు 5 లక్షల కోట్ల మేరకు పెరిగింది. అలాగే నిన్న అదానీ మీద అమెరికాలో నమోదైన కేసు విషయమై నష్టపోయిన అదానీ గ్రూప్ షేర్స్ అన్ని లాభాల బాట పట్టాయి.

దీనిలో అదానీ ఎనర్జీ మినహాయిస్తే మిగిలిన అన్న షేర్స్ దాదాపు 6 % రికవరీ అయ్యాయి. ఇందులో అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ వంటివి రికవరీ బాట పట్టాయి. అయితే రేపు రానున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఈ దేశీయ మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తాయా.? లేక మళ్ళీ బేర్ తో నేల చూపులు చూస్తాయా అనేది తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories