సుప్రియపై స్టార్ ప్రొడ్యూసర్ల సెటైర్లు

Producers Satires Supriya

ఇవాళ హైదరాబాద్ లో జరిగిన “డెకాయిట్” ప్రీరిలీజ్ ఈవెంట్లో ఒక విశేషమైన విషయం చోటు చేసుకుంది. ఈమధ్యకాలంలో ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఒక స్టేజ్ మీద నిలబడడమే పెద్ద విషయంగా పరిగణిస్తుంటే.. “డెకాయిట్” ఈవెంట్ లో ఏకంగా అరడజనుకుపైగా ప్రొడ్యూసర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సురేష్ బాబు, నాగవంశీ, మైత్రీ రవి, స్వప్న దత్, అభిషేక్ అగర్వాల్ తదితరులు విచ్చేసి మాట్లాడుతూ.. “సుప్రియ మాకు క్లాసులు పీకేది, హీరోల్ని నెత్తిన పెట్టుకోకండి అంటూ చెప్పేది, ఇప్పుడు ఆవిడ సినిమా తీశాక నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయి” అంటూ ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

మరీ ముఖ్యంగా నాగవంశీ అయితే.. “శేష్ ఒక రెండేళ్లు సుప్రియకు టార్చర్ పెట్టినందుకు థ్యాంక్స్, సొంత హీరోలతో సినిమాలు తీసి ఆమెకు కష్టం తెలియలేదు, ఇప్పుడు 149 రోజులు షూట్ చేసి హీరోలతో సినిమాలు చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో తెలిసింది” అంటూ వేసిన సెటైర్ మాత్రం చర్చనీయాంశంగా మారింది.

స్టార్ హీరోలతో సినిమాలు తీయడం నిజంగానే అంత టార్చరా? అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, ఇంకొందరు మాత్రం నాగవంశీ, మైత్రి రవిలు ఇంతలా స్టేజ్ మీద కామెంట్ చేశారంటే.. సుప్రియ గిల్డ్ మీటింగుల్లో ఏ రేంజ్ లో క్లాసులు పీకి ఉంటుందో అని కామెంట్ చేస్తున్నారు.

సుప్రియ తన కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో “డెకాయిట్” నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలవుతున్న ఈ సినిమాకి ప్రీమియర్లు వేయాలా వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు చిత్రబృందం. ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి, శేష్ బ్రాండ్ ఇమేజ్ ని సరిగ్గా వాడుకోవాలనుకుంటే ప్రీమియర్లు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే.. సినిమా బుకింగ్స్ ఇవాళ ఓపెన్ అయినప్పటికీ, ఆశించిన స్థాయి బుకింగ్స్ రాలేదు.

ప్రీమియర్స్ బజ్ తోనే సినిమాని నిలబెట్టాల్సిన బాధ్యత సుప్రియ మీద ఉంది. సో, సోలో ప్రొడ్యూసర్ గా సుప్రియ ఏ స్థాయి హిట్ అందుకోబోతోంది అనేది తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే.. నిర్మాతల సెటైర్లు మాత్రం కొన్నిరోజులు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories