మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్‌కు దృవ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం దర్శకుడు సురేందర్ రెడ్డికి రామ్ చరణ్‌కు మద్య చిన్న చిన్న విబేధాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి గత చిత్రం ‘కిక్ 2’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు చరణ్ ఓకే చెప్పాడు. అయితే స్క్రిప్ట్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చెబుతూ, సినిమా షూటింగ్‌ను వేగంగా జరగకుండా చరణ్ చేస్తున్నట్లుగా దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆరోపించాడట. ఆ విషయం చరణ్ వద్దకు చేరి దర్శకుడు సురేందర్ రెడ్డిపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సైతం దర్శకుడు సురేందర్ రెడ్డిపై కాస్త సీరియస్ అయినట్లుగా సమాచారం.
దాంతో ప్రస్తుతం సురేందర్ రెడ్డి కాస్త తగ్గి ఉంటున్నాడు అని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలోనే దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.



