కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం స్పీకర్ మదుసూదనాచారి కి అందిన వెంటనే ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారని, రేవంత్ రాజీనామా అందితే కొడంగల్ కు ఉప ఎన్నిక తప్పదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అయితే ఫిరాయింపులు, రాజీనామా ఆమోదాలు మీద మాట్లాడే నైతిక హక్కు తలసానికి ఉందా అనేది చూడాలి?
తెలంగాణాలో ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపుల విషసంస్కృతికి బీజం వేసింది ఆయనే. తెలుగు దేశం టికెట్ మీద గెలిచి రాజీనామా చెయ్యకుండా తెరాసలో జేరి మంత్రి అయ్యారు తలసాని. అయితే ఈ సందర్భంగా తన రాజీనామా ప్రస్తావన అనవసరం అని తలసాని అనడం విశేషం.
తెలంగాణాలో టిడిపి ఎప్పుడో టిఆర్ఎస్ లో విలీనం అయిపోయిందని ఆయన చెప్పారు. తెలంగాణాలో టీడీపీ తెరాసలో ఎప్పుడో విలీనం అయిపోతే అసలు రేవంత్ కూడా రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదుగా. నైతికతకు కట్టుబడి రేవంత్ ఎలాంటి షరతులు లేకుండా స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా సమర్పించారు.


