తమిళనాడు,బెంగాల్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఎవరు ఊహించని విధంగా జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు తమిళనాడులో సుమారు 82.24% పోలింగ్ నమోదు కాగా అటు బెంగాల్ లో 90% పోలింగ్ నమోదైనట్టు సమాచారం.
ఈస్థాయిలో జరుగుతున్న పోలింగ్ పర్శంటేజ్ తో రెండు రాష్ట్రలలో ఏ పార్టీకి అధికార పీఠం వరిస్తుందో ఎవరికీ ప్రతిపక్ష హోదా లభిస్తుందో అంచనా వేయడం కష్టంగా మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
2024 ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో గతంతో పోలిస్తే ఎన్నికల ఓటింగ్ పర్శంటేజ్ గణనీయంగా పెరిగింది. దేశ విదేశాల నుంచి కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని మరి ఏపీ ప్రజలు తమ సొంత రాష్ట్రానికొచ్చి పోలింగ్ బూత్ ల ముందు క్యూ కట్టారు.
దాని ఫలితం కూటమికి అనుకూలంగా మారి 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ని 11 కి పరిమితం చేసి వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఘోర ఓటమిని అందించింది. అలాగే 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీలు సాధించి అధికార పీఠాన్ని కైవశం చేసుకుంది.
అలాగే ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ లో జరుగుతున్న పోలింగ్ కూడా అనూహ్యంగా భారీ స్థాయిలో జరగనుండడంతో ఈ పెరిగిన ఓటింగ్ పర్శంటేజ్ ఏ పార్టీ ఓట్లను చీల్చనుందో.? ఏ పార్టీకి అనుకూలంగా మారనుందో అన్న చర్చ ఊపందుకుంది.
దళపతి విజయ్ TVK పార్టీ తమిళ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. విజయ్ ఒంటరి పోరు అధికార డీఎంకే ఓట్లను చీల్చనుందా.? లేదా బీజేపీ, అన్నా డీఎంకే ఓట్లను పంచుకోనుందా.? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ఇక బెంగాల్ లో మమతా ప్రతిపక్షాలను వారి స్థానాలకే పరిమితం చేసి మరోసారి అధికార పీఠాన్ని అందుకుంటారా.? లేదా బీజేపీ తన ఎన్నికల వ్యూహాలతో ఈసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అన్నది కూడా దేశ రాజకీయాలలో ఆసక్తి గా మారింది.
ఏపీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ పర్శంటేజ్ అధికార వైసీపీ కి శాపంగా మారగా ప్రతిపక్ష కూటమికి కలిసొచ్చింది. అలాగే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలలో పెరిగిన ఓటింగ్ పర్శంటేజ్ కూడా అధికార పార్టీలకు కి వరంగా మారతాయా.? లేదా ప్రతిపక్షాలకు అవకాశంగా అవుతాయా.? లేదా కొత్త పార్టీతో ఒంటరి గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన విజయ్ కి అనుకూలం అవుతుందా.?




