దేవుడిపైనే భారం వేసిన వైద్యులు… ‘అమ్మ’ గుండె ఆగిందా? కొట్టుకుంటోందా?

tamil-nadu-cm-jayalalithaa-suffers-cardiac-arrestప్రస్తుతం ఒక్క తమిళనాడు ప్రజలనే కాదు, దేశమంతటా ఒక్కటే చర్చ… అదే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండె కొట్టుకుంటోందా? లేదా? అవును… ఆదివారం నాడు సాయంత్రం అకస్మాత్తుగా జయలలితకు గుండెపోటు అన్న విషయం తెలిసిన నాటి నుండి తమిళనాడు ప్రజలు కన్నార్పకుండా టెలివిజన్లు చూసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అలాగే ‘అమ్మ’ కోలుకోవాలని నిరంతర ప్రార్ధనలు కొనసాగుతూనే ఉంటున్నాయి.

తాజా సమాచారం మేరకు జయలలితకు ఎక్మో (ఎక్స్ ట్రా కార్పోరల్ మెబ్రేన్ ఆక్సిజన్) పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గా అమర్చి చికిత్స అందిస్తున్నారు. రోగి యొక్క ఊపిరితిత్తులు, గుండె పనిచేయని సమయంలో చివరి అవకాశంగా ఎక్మోను వినియోగిస్తారని తెలుస్తోంది. అయితే ఓ పక్కన ఇలా వైద్యం ఇస్తూనే మరో పక్కన తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పలు అనుమానాలకు తావిస్తోందని… ‘అమ్మ’ అభిమానులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ADVERTISEMENT

చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్ ను మూసివేయడం… తమిళనాడులోని అన్ని జాతీయ రహదారులు, టోల్ ప్లాజాల వద్ద సైన్యం మోహరించడం… కేంద్రం నుండి 11 కంపెనీల పారామిలటరీ బలగాలను రప్పించడం… రాష్ట్రంలో సెలవుల్లో ఉన్న పోలీసులను వెంటనే విధుల్లో హాజరు కావాలని ఆదేశించడం… రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కు సెలవులు మంజూరు చేయడం… తమిళనాడులో ఏర్పడనున్న పరిణామాలతో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచనలు చేయడం… ఇవన్నీ సగటు అభిమానిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఎలాంటి వార్త బయటకు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పరోక్ష సంకేతాలను ప్రజల్లోకి పంపించడానికే అన్న మాటలు సర్వత్రా వినపడుతోంది. అయితే ఏదైనా ‘అధ్బుతం’ జరిగి మళ్ళీ జయమ్మ తిరిగి వస్తుందని అభిమానులు, పార్టీ నేతలు ఆశిస్తున్న నేపధ్యంలో… అపోలో ఆసుపత్రి వైద్యులు చేసిన ట్వీట్ సంచలనాత్మకమైంది. “మా ప్రయత్నం మేం చేస్తున్నాం, మీరు కూడా ప్రార్ధించండి” అంటూ అపోలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ADVERTISEMENT
Latest Stories