టీడీపీ సహనానికి – ఓర్పుకి ఎక్స్ పైరీ వచ్చిందా.?

tdp-breaks-silence-as-ms-raju-counters-kcrs-remarks

బిఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నాయకుల నుంచి టీడీపీ పై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు ఎదురైనా టీడీపీ నుంచి కనీస స్పందన కరువుతుంది. టీడీపీ ఈ నిశ్శబ్దతే బిఆర్ఎస్ ను మరింత దూకుడుగా ముందుకొచ్చేలా చేస్తుంది అనేది టీడీపీ మద్దతుదారుల నుంచి వినపడుతున్న బలమైన అభిప్రాయం.

అయితే ఆ నిశ్శబ్దాన్ని నేడు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన కౌంటర్ లతో బద్దలు కొట్టారు. ఈ నెల 20 న రెండేళ్ల తరువాత ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

2014 నాటి టీడీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ నాటి ముఖ్యమంత్రిగా బాబు రాజకీయ నిర్ణయాలను కించపరుస్తూ కేసీఆర్ బాబు పై నోరు పారేసుకున్నారు. గతంలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ లంటూ నాటి ముఖ్యమంత్రి బాబు నానా హంగామా చేసారు.

అయితే తీరా ఆ ఎంవోయూ ల గురించి ఆరా తీస్తే వాటి మీద సంతకాలు పెట్టింది స్టార్ హోటల్ లో పనిచేసే సిబ్బందని తేలింది, ఇలా ఏమి లేకున్నా బాబు ఇచ్చే హైప్ అలా ఉంటుంది అంటూ కేసీఆర్ బాబు పై మరోసారి తన అక్కసును బయటపెట్టుకున్నారు.

అయితే నాటి నుంచి బిఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ ఎందుకు ముందుకురావడం లేదు.? అహంకారంతో కూడిన కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ నుంచి స్పందన ఏది అంటూ టీడీపీ సానుభూతిపరులు ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులకు నేడు ఎంఎస్ రాజు రూపంలో సమాధానం దొరికింది.

పార్టీ ఓటమితో రెండేళ్లు ప్రజాక్షేత్రాన్ని, పార్టీ బాధ్యతలను గాలికొదిలి ఫామ్ హౌస్ లో పడుకున్న మీరు బాబు పై విమర్శలా.? అసలు కేసీఆర్ ఏ బ్రాండ్ తాగి మీడియా ముందుకొచ్చారో.? తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో సైతం పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ మతిభ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

బాబు దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దుకున్న వారు కూడా బాబు ని రాజకీయంగా విమర్శిస్తున్నారు, కేటీఆర్ లాంటి అసమర్దుడిని నమ్ముకుని పార్టీని ముందుకు తీసుకెళ్లలేమని గ్రహించి ఇలా బయటకొచ్చి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చుకి కేసీఆర్ నిప్పు రాచేస్తున్నారు అంటూ ఎంఎస్ రాజు కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇలా బిఆర్ఎస్ నేతలు బాబు మీద, టీడీపీ పార్టీ మీద అవాకులు చవాకులు పేలడం ఇదే తొలిసారి కాదు. నాడు ఏపీ రాజధాని అమరావతి మొదలు ఆంధ్రా బిర్యానీ వరకు, అలాగే పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ వరకు జగన్ ముఖ్యమంత్రి నుంచి బాబు అరెస్టు వరకు ఇలా ప్రతి అంశంలోనూ బిఆర్ఎస్ టీడీపీ కి రిటర్న్ గిఫ్ట్ ల రూపంలో బాబు పతనానికి ప్రణాళికలు వేస్తూనే ఉంది.

అయినా టీడీపీ ఎప్పుడు సహనం అనే మౌనాన్ని ధరించి ఓర్పు అనే ఆనకట్ట కట్టుకుని రెండు రాష్ట్రాల మధ్య విద్వేష రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తూ వస్తుంది. కానీ ఆ సహనానికి, ఓర్పుకి కూడా ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని, ఇక ఆ తరువాత మౌనం కూడా మాట్లాడక తప్పదని టీడీపీ ఎంఎస్ రారాజు రూపంలో బయటకొచ్చింది.

ADVERTISEMENT
Latest Stories