
రాజకీయ పార్టీలు అనేక కారణాలతో ఎదురు దెబ్బలు తింటుంటాయి. జగన్, వైసీపీ నేతల స్వీయ తప్పిదాల వ్వాలనే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది.
ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత అయినా జగన్ ప్యాలస్‌లో నుంచి ప్రజల మద్యకు వచ్చి ఉంటే ఆ పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడి ఉండేది. కానీ ప్రాణ భయంతోనో లేదా అరెస్ట్ భయంతోనో బయటకు రావడం మానుకుని ప్యాలస్‌లో కూర్చొనే రాజకీయాలు చేస్తున్నారు.
Also Read – ఒవైసీ రాజకీయాలు వైసీపీ కోసమేనా.?
ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఎలాగైనా నడిపించుకోవచ్చు. కానీ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ చెందిన అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి మీడియాలో ఓ జర్నలిస్ట్ చేత చెప్పించడం యాదృచ్ఛికం కానే కాదు.
తాను వద్దనుకొని పాడుబెట్టిన అమరావతిని సిఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించి శరవేగంగా నిర్మాణ పనులు చేయిస్తుండటం జగన్ జీర్ణించుకోవడం చాలా కష్టమే. కనుక తన చేతిలో ఉన్న సాక్షి మీడియా ద్వారా అమరావతిపై ఈవిదంగా బురద జల్లించారని చెప్పక తప్పదు.
Also Read – మిథున్ రెడ్డి ఏ-4 అంటే సరిపోదు…
ఒకవేళ జగన్ కూడా అమరావతి నిర్మాణ పనులను కొనసాగించి ఉండి ఉంటే, సాక్షి మీడియా ఈవిదంగా బురద జల్లి ఉండేది కాదు కదా?
జగన్ యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు చేయిస్తే చంద్రబాబు నాయుడు చేయించలేకపోతున్నారనో లేదా నాసిరకం పనులు జరుగుతున్నాయనో సాక్షి మీడియా ఆరోపించి ఉండేది. కానీ అమరావతి వేశ్యల రాజధాని అని బురద జల్లిందంటే ఉద్దేశ్యపూర్వకంగానే అని అర్దమవుతోంది.
Also Read – మెగా సినిమాలకు ఏమయ్యింది.?
పైగా సాక్షిలో ఈ ఇంటర్వ్యూ నిర్వహించింది వారి ఆస్థాన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్. కనుక ఇంటర్వ్యూలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఆయనకు బాగా తెలుసు.
కానీ అమరావతి గురించి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో మహిళల గురించి ఇంత చులకనగా మాట్లాడించారు. దానిని సాక్షి మీడియా ఏమాత్రం సంకోచించకుండా ప్రసారం చేసింది!
అమరావతి నిర్మాణ పనులని జగన్ ఎలాగూ ఆపలేకపోతున్నారు కనుక ఏదో విదంగా దానిపై బురద జల్లుతూ అక్కసు తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనో ఇది ప్రసారం చేసినట్లు భావించవచ్చు.
వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమని తెలిసి ఉన్నప్పుడు, కనీసం ఆ తప్పుని సరిదిద్దుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్న అమరావతి వేశ్యల రాజధాని అని సాక్షి చేత దుష్ప్రచారం చేయించడం క్షమార్హం కాదు. దీనిపై ప్రభుత్వం తగు చర్య తీసుకుంటుందనే ఆశిద్దాం.
కానీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదని ఇది మరోసారి స్పష్టం చేస్తోంది.
ఆనాడు శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణిపై తామందరం చాలా నీచంగా మాట్లాడినందుకు తన భార్య చీవాట్లు పెట్టిందని మాజీ మంత్రి జోగు రమేష్ స్వయంగా చెప్పారు.
ఇప్పుడు అమరావతిపై సాక్షి మీడియాలో జగన్ చేయించిన ఈ ఏహ్యమైన వ్యాఖ్యలతో వైసీపీని ప్రజలందరూ అసహ్యించుకున్నారని భవిష్యత్‌లో ఏదో రోజున జోగి రమేష్ వంటివారే చెప్పుకోవచ్చు.
ఎన్నికలలో వైసీపీని కూటమి ఓడించింది. కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీని ఎవరూ ఓడించనవసరం లేదు. జగనే ఇటువంటి నీచమైమైన ఆలోచనలతో స్వయంగా వైసీపీని భస్మాసురుడిలా నాశనం చేసుకుంటున్నారు. ఆయనకు సాక్షి ఉడతా భక్తిగా తోడ్పడుతోంది. 2024 ఎన్నికలలో అలాగే తోడ్పడింది. 2029కి తప్పక తోడ్పడుతుంది.