ఇక మొదలుపెడదామా! అన్నట్లుగా టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ రాజమండ్రి కేంద్రంగా మొదలైయ్యింది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా ఇరు పార్టీల ఉమ్మడి జేఏసీ సమావేశంలో కార్యక్రమాల రూపకల్పన జరిగింది. టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ అనే ముఖ్య పాత్రలతో “ఆంధ్రప్రదేశ్ అనే తెర మీద రాజకీయాలు అనే సినిమా” మొదలవడానికి ఇంకా కొద్దీ సమయమే మిగిలివుంది.
అయితే ఇందులో హీరో ఎవరో, విలన్ ఎవరో, కమీడియాన్ ఎవరో నిర్ణయించేది మాత్రం ప్రజలే.ప్రస్తుతానికి అందరు నటీనటులే. అయితే ఈ సినిమాలో అధికార పార్టీ పై పోరాటానికి సిద్ధమయ్యారు టీడీపీ – జనసేనలు.ఈ పోరాటానికి నాంది పలికింది మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఘట్టమే. బాబు అరెస్టుతో ఇరు పార్టీల నేతలను ఒకేతాటి మీదకు తెచ్చిన జగన్ ఇప్పుడు చేసిన తప్పు సరిదిద్దుకోలేక వ్యక్తిగత దూషణలతో తన రాజకీయాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇరు పార్టీల జేఏసీ సమావేశం ముగించుకుని మీడియా ముందుకు వచ్చిన పవన్, లోకేష్ లు పొత్తు ముఖ్య ఉద్దేశంప్రజలకు వివరించారు. అస్థిరతకు గురైనా ఏపీలో సుస్థిర పాలన నెలకొల్పడమే ఇరు పార్టీల ముఖ్య ఉద్దేశం.అలాగే వైసీపీ పార్టీ బారిన పడని రాజకీయ పార్టీ ఏపీలో లేదు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదని, ఇసుక దోపిడీ, రాష్ట్రంలో ఖనిజాల దోపిడీ, ప్రత్యర్థి పార్టీల నేతల పై కేసులతో బెరింపులు వైసీపీ పార్టీ నైజం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
తానూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ముందుగా చెప్పిన మాట ప్రకారమే తానూ అడుగులు వేయడం జరిగిందని, ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టింది దానికి జనసేన – టీడీపీ పొత్తే సరైన వాక్సిన్ అన్నారు. తానూ ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు నిర్ణయానికి మొగ్గుచూపడం జరిగింది అన్నారు పవన్. అలాగే లోకేష్ మాట్లాడుతూ ఉమ్మడి జేఏసీ లో భాగంగా మూడు తీర్మానాలకు ఆమోదం తెలపడం జరిగిందని వాటిని వివరించారు.
1 . చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండించడం జరిగింది.
2 . వైసీపీ అరాచకత్వాలను ప్రజల ముందుంచడం.
3 . అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి బాటలో నిలబెట్టడం.
అలాగే రెండు పార్టీల ఉమ్మడి మానిఫెస్టో ను సిద్ధం చేయడం, క్షేత్ర స్థాయి నేతలను సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్లడం వంటి కార్యక్రమాలతో జేఏసీ మొదటి సమావేశంలో చర్చించడం జరిగింది అంటూ ఇరు పార్టీల నేతలు తెలిపారు.
అయితే ఇక్కడ పవన్, లోకేష్ ఇద్దరు బాబు అరెస్ట్ పట్ల వైసీపీ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తుందో వివరించారు. టెక్నికల్ ఇష్యూ అనే కారణంతో వైసీపీ ప్రభుత్వం బాబుకి బెయిలు రాకుండా కుట్ర చేస్తుందని పవన్ ఆరోపించారు. తన అక్క మీద దాడిని అడ్డుకున్న 14 సంవత్సరాల బాబు ని హత్య చేసిన నేరస్తుడికి కూడా వెంటనే బెయిలు వచ్చింది.
కానీ ఆధారాలు లేని ఆరోపణలతో జైలుకు వెళ్లిన చంద్రబాబుకి బెయిలు రాకపోవడం వైసీపీ తాలుకా నిరంకుశత్వాన్ని బయటపెడుతున్నది అంటూ పవన్, లోకేష్ ఇద్దరు వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు నిలయంగా మారిపోయింది అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. రెండు పార్టీల నేతలు సహకారంతో ముందుకెళతాం, సమన్వయంతో వైసీపీ పార్టీని సంహరించి ఏపీలో సుస్థిర పాలన అందిస్తాం ఇదే రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ.
రాష్ట్ర పదవులు కాదు రాష్ట్ర అభివృద్దే మారెండు పార్టీల అంతిమ లక్ష్యం అంటూ లోకేష్, పవన్ లు తమ ఆలోచనలను ప్రజల ముందుంచారు. ఇరు పార్టీల అధినేతల కలయికతో రెండు పార్టీల నేతలలో నూతన ఉత్తేజం నెలకొంది. ఇక మొదలెడదామా! యుద్ధం అంటూ అంతే జోష్ గా క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు పని చేస్తే అధినేతల అంతిమ లక్ష్యం నెరవేరుతుంది.




