వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలి అని టీడీపీ – జనసేన పొత్తుకు సిద్ధమైయ్యారు. అయితే అధినేతలు తీసుకున్న నిర్ణయాల పై ఇరు పార్టీ నాయకుల, కార్యకర్తల స్పందన ఎలా ఉంటుందో అని భయపడిన వారికి ఒకరకమైన ఉత్సహాన్నే నింపిందని చెప్పాలి.
రాష్ట్ర భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని ఇరు పార్టీల అధినేతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బల పరుస్తూ నేడు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. పొత్తులలో భాగంగా ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీనే కీలకమైన అంశం. ఇద్దరు పార్టీల మద్దతు దారులు తమ నియోజక వర్గంలో నిలబడిన ఉమ్మడి అభ్యర్థిని బలపరిచిన రోజే ఉమ్మడి ప్రణాళికల లక్ష్యం నెరవేరుతుంది.
అయితే వైసీపీ చేస్తున్న అకృత్యాలకు – అక్రమాలకు విసిగిపోయిన ఇరు పార్టీ కార్యకర్తల వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తమముందున్న అంతిమ లక్ష్యం అన్నట్టుగా నేతల నిర్ణయాలకు తమ ప్రతిస్పందన తెలియచేస్తున్నారు. నేడు టీడీపీ – జేఎస్పీ పార్టీల సామాజి క మాద్యమాలలో టీడీపీ ని వ్యతిరేకించే అభిమానులు కూడా తమ స్వరాన్ని మార్చుకుంటూ చంద్రబాబూ కి సంఘీభావం ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
తమ అధినేతలు తీసుకున్న అన్ని నిర్ణయాలకు వంద శాతం ఆమోదం ఎక్కడ లభించదు. ఇరు పార్టీలలోనూ పొత్తుని వ్యతిరేకించే నేతలు, కార్యకర్తలు లేక పోలేదు. అయితే అందులో మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే ముందుకెళ్తారు నాయకులు. వ్యతిరేకించే నేతలను సమన్వయ పరుచుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఛీలిపోకుండా చూడడం నాయకులకు కత్తిమీద సామే అవుతుంది.
ఒక్కసారి రెండు పార్టీల శ్రేణులు ఒకేతాటి పైకి వస్తే మళ్ళి వైసీపీ కి 2014 ఎన్నికల ఫలితాలే కళ్ళముందు వచ్చి నిలుస్తాయి అనడంలో ఎటువంటి సంశయం లేదు. వైసీపీ బలహీనతే ఇరు పార్టీల బలంగా మార్చుకోవాలి. రెండు పార్టీల నేతలు – కార్యకర్తలు సమన్యయంతో ముందుకెళ్తే వైసీపీ నాయకుల ఆటవిక పాలనకు చర్మ గీతం పలకడం పెద్ద కష్టమేమి కాదు.