ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ అధికార వైసీపీ మాత్రం ప్రతిపక్షాలు పై తన అధికార మదాన్ని ప్రదర్శిస్తూ పార్టీ క్యాడర్ ను భయబ్రాంతులకు గురిచేసే ఆలోచనలో ఉన్నట్టుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతల ప్రజాక్షేత్ర యాత్రలకు తాత్కాలికంగా బ్రేకులు వేయగలిగింది.
అలాగే స్థానికంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎదిరిస్తున్న ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులు చేస్తూ కింద స్థాయి నేతలను కట్టడి చేస్తున్నారు స్థానిక అధికార పార్టీ నేతల అనుచరులు. తాజాగా బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతల చేతులో చెప్పు దెబ్బలు తింటున్న తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ గోపాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వైకాపా నేతల దాడులు పై స్పందించిన లోకేష్, మా విజయ్ గోపాల్ ను చెప్పుతో కొట్టిన ప్రతి ఒక్క వైసీపీ సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. పాలక పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఎం చేస్తున్నారు. బాధితులపై రివర్స్ కేసులు బనాయిస్తూ అధికార పార్టీకి అండగా నిలబడం సిగ్గుచేటు అన్నారు.
వైసీపీ నేత నాగేశ్వర రావు చేస్తున్న అక్రమాలు, భూకబ్జాలు గురించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చి అధికార పార్టీ నేతల పై కేసు పెట్టాడనే నెపంతో విజయ్ గోపాల్ ను రోడ్డు మీదకు లాగి అత్యంత అమానవీయంగా చెప్పులతో దాడి చేస్తూ వైకాపా నాయకులు చేస్తున్న అకృత్యాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు స్థానికలు. అమితంగా తింటే గారైయినా చేదుగా మారుతుంది అనే సామెత మాదిరి రాష్ట్రంలో 151 సీట్లతో వైసీపీ “ఫ్యాన్ గాలి తుఫాన్” మాదిరి మారి ప్రజల మన ప్రాణాలను, ఆస్తులను నాశనం చేస్తుంది.
పూటకో మాటతో,రోజుకో దాడితో వైసీపీ వై నాట్ 175 అంటుంది. ఇప్పటికే తుపానుగా మారిన వైసీపీ గాలి 175 వస్తే ఇక సునామిగా రూపాంతరం చెంది రాష్ట్రాన్నే తుడిచిపెట్టే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీ నేతలు ఎన్ని అరాచకాలు చేసి వీడియో ఫోటేజ్ లతో అడ్డంగా దొరికినా వారి పైన చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలు ముందుకు రావడం లేదు,అధికారులు తమ అధికారాన్ని వాడడం లేదు.
ఇక ప్రజలే తమ ఓటు అనే బటన్ నొక్కి ఈ వైసీపీ పార్టీని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. అలాగే అదే చెప్పుతో వైసీపీ నాయకులను చావుదెబ్బ కొట్టి ప్రజాస్వామ్యాన్ని నిలిబెట్టాలి అంటూ లోకేష్ ప్రజలను చైతన్య పరిచారు.
కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్గోపాల్పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా విజయ్ గోపాల్ ని చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైకాపా సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలక పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా… pic.twitter.com/bKzKqnbLYY
— Lokesh Nara (@naralokesh) November 13, 2023




