రాబోయేది రణరంగమేనా..!

Gautham Gambir Team India Coach

భారత జట్టు టి-20 వరల్డ్ కప్ గెలిచాక కోచ్ గా పదవి బాధ్యతలను అందిపుచ్చుకున్నారు గౌతమ్ గంభీర్.గంభీర్ నేతృత్వంలో జింబాంబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి టయర్-2 జట్లతో మాత్రమే భారత్ సిరీస్ లు ఆడింది. అయితే, ఈ ముగిసిన అన్ని మ్యాచ్లలో కోచ్ గా గంభీర్ కు బాగానే మార్కులు పడ్డాయి.

ADVERTISEMENT

కానీ, వచ్చే 5 నెలలు తన కోచ్ పదవి బాధ్యతలకు అత్యంత కీలక సమయం కాబోతుంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా వంటి అగ్ర జట్టులతో భారత్ టీం తలపడనుంది. అయితే ఇది కేవలం జట్టు ఆటగాళ్లకే కాక, కోచ్ గా గంభీర్ కు సైతం పెద్ద సవాలు గా మారే అవకాశం లేకపోలేదు.

సూర్య నేతృత్వం లో బంగ్లాతో టి-20 సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత్, అక్టోబర్ 16 నుండి సొంత గడ్డ పై న్యూజిలాండ్ తో 3 టెస్టులు ఆడనున్నారు. దీనికి ఎంపిక చేసిన ఫైనల్ స్క్వాడ్ ని సైతం వెల్లడించారు టీం ఇండియా. శర్మ కెప్టెన్ గా వ్యవహరించగా, బుమ్రా కు వైస్-కెప్టెన్ బాధ్యతను అప్పగించారు.

ఇది ముగిసిన వెంటనే, మన కుర్రాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్లి వారి పై 4 టి-20 లు ఆడనున్నారు. నవంబర్ 8 న మొదలయ్యే ఈ సిరీస్ 15 కు ముగియనుంది. అయితే నవంబర్ 22 నుండి మోస్ట్ ఇంటరెస్టింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానుల కళ్ళనీ ఆ సిరీస్ కోసమే అన్నట్టుగా ఎదురు చూస్తున్నాయి.

ఆ పైన, వచ్చే ఏడాది మొదటి సిరీస్ గా ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లు ఉన్నాయి.అయితే మరి గౌతమ్ గంభీర్ ఇప్పటి దాకా చూసిన టీం ల ఆటతీరు ఒక లెక్క లో ఉంటాయి, ఇప్పటి నుండి వచ్చే 5 నెలలు ఆడబోయే టీంల సత్తా మరో లెక్కలో ఉంటాయి. కనుక గౌతమ్ ముందు రానున్న కాలం పెద్ద సవాళ్లనే ఉంచబోతుంది.

అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క అన్నట్టుగా గౌతమ్ భారత్ టీం ను గెలుపు దిశగా అడుగులు వేయించగలగాలి. అప్పుడే అతని మీద బీసీసీఐ తో పాటుగా క్రికెట్ ప్రేమికులు పెట్టుకున్న అంచనాలను అందుకోగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories