కేసీఆర్ ఈగో హర్ట్ అయ్యిందా?

Telangana CM KCR Ego Hurtsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటన చేశారు. నిన్న మొన్నటి వరకు కేంద్రంతో సఖ్యతతో మెలిగిన కేసీఆర్ ఉన్నటుంది మాట మార్చడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏకంగా ఢిల్లీపై కేసీఆర్ కన్ను పడటానికి కారణం ఏంటి అని చూస్తే ఆయన ఈగోని బీజేపీ వారు హర్ట్ చేశారు అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

ADVERTISEMENT

మొన్నఆమధ్య కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ముస్లిం రేజర్వేషన్ల బిల్లు గురించి ప్రధానితో మాట్లాడటానికి మోడీ అప్పాయింట్మెంట్ కోరారు. అయితే ప్రధాని కనీసం టైం కూడా ఇవ్వకపోవడం కేసీఆర్ అవమానంగా భావించారు. దాని పర్యావసానమే ఒక మీటింగ్ లో కేసీఆర్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. అదే స్పీచ్ లో మోడీ గాడు అని కూడా నోరుజారారు.

అయితే దీనికి కొందరు బీజేపీ నాయకులు కేసీఆర్ ను జైలులో పెట్టాలి అనడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనితోడు హైదరాబాద్ లో ఒక ప్రారంభానికి హాజరు కావాల్సిన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ను ఆ విషయంగా ఇరుకునపెట్టడం, ప్రారంభానికి రాను అని బెదిరించడం అన్నీ కేసీఆర్ ఈగోను హర్ట్ చేసినవే.

మరోవైపు తన థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలకు కేసీఆర్ జాతీయ స్థాయిలో మద్దత్తు కూడగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో మాట్లాడుతున్నట్టు సమాచారం. లోక్‌సభలో టీడీపీ ఎంపీలకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతుగా నిలిచారు. విభజన హామీలను అమలు చేయాలని టీడీపీ ఎంపీలు గళమెత్తుతుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు గొంతు కలిపారు. విభజన హామీలను అమలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు

ADVERTISEMENT
Latest Stories