
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం కొత్త చిచ్చు రగిలించేలా ఉంది. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి కేటాయించబడిన 8 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి ఇంతకాలం తెలంగాణలోనే కొనసాగుతున్నారు. కానీ వారందరూ ఈరోజులోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశించింది.
కానీ వివిద కారణాల చేత వారిలో ఏ ఒక్కరూ ఆంధ్రకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కనుక వారు డీవోపీటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్ళీ నిన్న ట్రిబ్యూనల్లో పిటిషన్లు వేశారు. కానీ ట్రిబ్యూనల్ కూడా డీవోపీటీ ఉత్తర్వులను సమర్ధించింది.
Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?
వరదలతో ఇబ్బందిపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీ సేవలు అవసరమైనప్పుడు ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటామంటే భావ్యం కాదు. కనుక తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని, తుది తీర్పుకి లోబడి తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
కానీ వారు ట్రిబ్యూనల్ సలహాని కూడా పట్టించుకోలేదు. ఇవాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉండగా వారందరూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. తాము తెలంగాణలోనే కొనసాగేందుకు వీలుగా డీవోపీటీని ఆదేశించాలని అభ్యర్ధిస్తూ పిటిషన్లు వేశారు.
Also Read – జగన్ ఆంధ్రా పరువు తీసేస్తే.. చంద్రబాబు నాయుడు..
కొద్ది సేపటి క్రితం వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు కూడా ఐఏఎస్ అధికారులను సున్నితంగా మందలించిఓంది. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న మీరు కూడా ఈవిదంగా ప్రవర్తించడం సరికాదని ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని హితవు పలికింది.
కానీ నవంబర్ 4వ తేదీన ట్రిబ్యూనల్ తుది తీర్పు చెప్పబోతోంది కనుక అంతవరకు సమయం ఇవ్వాలని వారి తరపు న్యాయవాది అభ్యర్ధించారు. అందుకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసిన్నట్లు ప్రకటించింది.
Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…
తెలంగాణ నుంచి ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, సృజన, హరికిరణ్ ఆంధ్రాకు రావలసి ఉంది. అదేవిదంగా ఏపీ నుంచి ముగ్గురు అధికారులు తెలంగాణకు వెళ్ళాల్సి ఉంది.
తెలంగాణలో చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రాకి వచ్చి పనిచేయడానికి వెనకాడుతుండటానికి వారి వ్యక్తిగత సమస్యలే ప్రధాన కారణాలుగా చెపుతున్నారు. గత పదేళ్ళుగా తెలంగాణలో పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడటంతో ఆంధ్రాకి వచ్చేందుకు వెనకాడుతున్నారు. కానీ వారు ఆంధ్రాకి వచ్చేందుకు ఇష్టపడకపోవడం ద్వారా ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నామని గ్రహించిన్నట్లు లేదు.